ఎముకలు కొరికే చలితో పాటు వర్షం.. అయినా తగ్గని రైతులు .. వర్షంలోనూ ఉధృతంగా అన్నదాతల ఆందోళన
ఎముకలు కొరికే చలి తీవ్రత ఉంది. దానితోపాటు తడిపి ముద్ద చేస్తున్న అకాల వర్షం.. అయినా సరే రైతులు ఆందోళన నుంచి వెనక్కి తగ్గడం లేదు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో దిక్కులు పిక్కటిల్లేలా సమర నినాదం చేస్తూనే ఉన్నారు. 40 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుంటూ ముందుకు సాగుతుంది. తమకు ప్రకృతి సహకరించకున్నా మొక్కవోని ధైర్యంతో రైతన్నలు వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు .. రైతుల ఉద్యమాన్ని దుర్భాషలాడటం మానుకోవాలని హితవు

ఏడో విడత చర్చల్లో ప్రతిష్టంభన.. కొనసాగుతున్న ఆందోళన
40 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తరఫున ఏడో విడత చర్చల్లో కూడా ప్రతిష్టంభన నెలకొనడంతో రైతులు ఈ రోజు కూడా తమ ఆందోళనను కొనసాగించారు . ఢిల్లీలో అకాల వర్షం కురుస్తున్నా, ఒక పక్క చలి చంపేస్తున్నా ప్రాణాలైనా వదిలేస్తాం కానీ పోరాటం మాత్రం ఆపమంటూ అన్నదాతలు పోరాటం సాగిస్తున్నారు. ఇక ఏడో దశ జరిగిన చర్చలు కూడా విఫలం కావడంతో మరోమారు ఈనెల 8వ తేదీన భేటీని నిర్వహించారు.
ఎద అందాలతో కనువిందు చేస్తున్న అదా శర్మ... లేటేస్ట్ ఫోటోలు

నేడు సమావేశం కానున్న రైతు సంఘాలు .. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
రైతులు మాత్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తానని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం రైతుల మొండివైఖరి వీడాలని విజ్ఞప్తి చేస్తున్నా , చట్టాలను వెనక్కి తీసుకునే పరిస్థితి లేనే లేదని తేల్చి చెబుతున్నా, రైతులు వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే తమ ప్రధాన డిమాండ్ అంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోమారు కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో నేడు రైతు సంఘాల సమావేశం కానున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుని ముందుకు సాగనున్నాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చెయ్యాలని నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది .

వ్యవసాయ చట్టాల రద్దే ప్రధాన డిమాండ్
కేంద్రం ఎన్ని దఫాల పాటు చర్చలు జరిపినా చర్చలలో పాల్గొంటామని చెబుతున్న రైతులు తమ ప్రధాన డిమాండ్ వ్యవసాయ చట్టాల రద్దు అని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికి పదుల సంఖ్యలో రైతులు చలిదెబ్బ కు ప్రాణాలు వదిలినా , ప్రాణాలైనా ఇస్తాం కానీ నూతన వ్యవసాయ చట్టాలను అంగీకరించమంటూ మిగిలిన రైతులు భీష్మించుకు కూర్చున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే లెక్క చెయ్యమని , ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు .