• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు

|

కేంద్ర నూతనంగా తీసుకొని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పండించిన పంట గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళన 100 వ రోజుకు చేరుకుంది. వంద రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై మొండిగా వ్యవహరిస్తోంది. అటు రైతులు సైతం వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు.ఇక నేటితో రైతుల ఆందోళనకు 100 రోజులు కావటంతో నేడు బ్లాక్ డే పాటిస్తున్నారు.

మార్చి 24 వరకు మహాపంచాయతీలు .. కేంద్రానివి రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు : రాకేశ్ టికాయత్

గత వంద రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో కొనసాగుతున్న రైతుల ఆందోళన

గత వంద రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో కొనసాగుతున్న రైతుల ఆందోళన

రైతులు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన మొదలుపెట్టారు . అక్కడ వారు తాత్కాలికంగా వేసుకున్న గుడారాలను శాశ్వత నిర్మాణాలు గా మార్చారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కూలర్లు , ఎయిర్ కండిషనర్ ల తో సిద్ధమయ్యారు. గత వంద రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో కొనసాగుతున్న రైతుల ఆందోళన, సరిహద్దుల్లో జనం సన్నగిల్లడంతో తగ్గినట్టు కనిపిస్తున్నా, దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన విస్తరిస్తోంది. రాష్ట్రాల వారీగా రైతులు మహా పంచాయతీలు నిర్వహించి ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు . అంతర్జాతీయంగానూ రైతుల ఆందోళన పై ఆసక్తి నెలకొంది.

నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు , కుండ్లి-మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధం

నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు , కుండ్లి-మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధం

వంద రోజులుగా తమ సమస్య పరిష్కారం కాని కారణంగా రైతులు ఈరోజు బ్లాక్ డే గా పాటిస్తున్నట్లు గా స్పష్టం చేశారు ఢిల్లీ శివార్లలోని కుండ్లి-మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే ను ఐదు గంటలు దిగ్బంధించాలని రైతులు నిర్ణయించారు. రహదారులను అడ్డుకోవడంతో పాటు, సాంయుక్ట్ కిసాన్ మోర్చా, హైవేల దగ్గర ఉన్న టోల్ ప్లాజాలను టోల్ చెల్లింపులు లేకుండా కొనసాగించాలని, దేశవ్యాప్తంగా కార్యాలయాలు మరియు నివాసాల నుండి నల్ల జెండాలను ఎగర వేయాలని పిలుపునిచ్చింది.

నవంబర్ లో ఆందోళన ప్రారంభించిన రైతులు

నవంబర్ లో ఆందోళన ప్రారంభించిన రైతులు

మొదట పంజాబ్ మరియు హర్యానాకు చెందిన రైతులు 2020 నవంబర్‌లో తమ చలో ఢిల్లీ కవాతుతో దేశ రాజధాని వైపుకు వెళ్లారు. ఆ నెల 26 నుండి, వారు సింగు మరియు తిక్రీ వంటి వివిధ సరిహద్దు పాయింట్ల వద్ద శిబిరాలకు చేరుకున్నారు. కొద్ది రోజుల తరువాత ఘాజీపూర్‌లో ఉత్తర ప్రదేశ్ రైతులు చేరారు. పార్లమెంటు సెప్టెంబర్‌లో అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

 అనేకమార్లు ప్రభుత్వంతో చర్చలు విఫలం .. ఆందోళన ఉధృతం చేస్తున్న రైతన్నలు

అనేకమార్లు ప్రభుత్వంతో చర్చలు విఫలం .. ఆందోళన ఉధృతం చేస్తున్న రైతన్నలు

ప్రతిష్టంభన నుండి బయటపడటానికి రైతుల ప్రతినిధులు మరియు ప్రభుత్వం మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ చర్చలు సఫలం కాలేదు. కేంద్రం చట్టాల రద్దుకు మొగ్గుచూపకపోగా, కొంతకాలం చట్టాలను వాయిదా వేయడానికి రైతులను అంగీకరించవలసిందిగా కోరింది. సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్న రైతులు సాగు చట్టాలను రద్దు చేస్తేనే తాము ఇంటికి వెళ్తామని తేల్చి చెబుతున్నారు. పోరు విత్తనాన్ని నాటామని, పంట పండితేనే ఇళ్లకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు.

English summary
Farmers protest reached 100 days .. with this farmers are announced today is a 'Black Day' , the 100th day of their protest. As part of the proceedings, the Kundli-Manesar Palwal Expressway will be blocked for five hours. Besides blocking highways, the Samyukt Kisan Morcha, an umbrella organisationof various farmer bodies, has given a call to free the toll plazas near the highways that are to be blocked and wave black flags from offices and residences across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X