వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2024 దాకా పోరాటం ఆగదు -సాగు చట్టాలపై కేంద్రానికి రైతుల వార్నింగ్ -19న సుప్రీం కమిటీ భేటీ

|
Google Oneindia TeluguNews

వ్యవసాయం రంగంలో సంస్కరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసనలు 53వ రోజైన ఆదివారం కూడా కొనసాగాయి. సర్కారు దిగిరాకుంటే దీర్ఘకాల పోరాటం చేస్తామని రైతుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. సమస్య పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈనెల 19న తొలిసారి భేటీ కానుంది..

'కర్ణాటక'ను మహారాష్ట్రలో కలిపేస్తాం -సీఎం ఉద్ధవ్ సంచలనం -మళ్లీ తెరపైకి బెల్గామ్ సరిహద్దు వివాదం'కర్ణాటక'ను మహారాష్ట్రలో కలిపేస్తాం -సీఎం ఉద్ధవ్ సంచలనం -మళ్లీ తెరపైకి బెల్గామ్ సరిహద్దు వివాదం

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని, ప్రభుత్వం దిగిరాకపోతే వచ్చే లోక్ సభ ఎన్నికలు (2024, మే నెల) వరకైనా ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధంగానే ఉన్నామని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్‌ పేర్కొన్నారు. చట్టాల రద్దుతోపాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిగించే వరకు పోరాడుతామని ఆదివారం నాగ్‌పూర్‌లో ఆయన మీడియాతో చెప్పారు.

farmers protest: SC panel first meet on 19 Jan, leaders says protests till May 2024

నిరసన చేస్తోన్న రైతులకు తమ డిమాండ్లపై క్లారిటీ లేదని, ఉద్యమంలో కేవలం ధనిక రైతులే ఉన్నారని, పేద రైతుల జాడ లేదని వస్తోన్న విమర్శలకు తికాయత్ సమాధానమిచ్చారు. ఇది కేవలం ధనిక రైతుల ఉద్యమంగా వస్తోన్న ఆరోపణలు నిజం కావని, మారుమూల గ్రామాల ప్రజలూ తమ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక..

కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్

కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు-కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తొలి భేటీ ఈ నెల 19న జరుగనున్నట్లు సభ్యుడు అనిల్‌ ఘన్వాత్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేస్తామన్నారు. నిపుణుల కమిటీ తొలి భేటీలో అనిల్‌ ఘన్వాత్‌తో పాటు డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీ, అశోక్‌ గులాటీలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. సభ్యుల్లో మరొకరైన భూపీందర్‌ సింగ్‌ మాన్‌ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, ఆయన స్థానంలో కొత్త సభ్యుడి ఎంపికపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

English summary
The Supreme Court-appointed committee on the three new farm laws will hold its first meeting on 19 January to decide the future course of action, its member Anil Ghanwat said on Sunday. Bharatiya Kisan Union (BKU) leader Rakesh Tikait on Sunday said farmers are prepared to protest against the Centre's new farm laws "till May 2024".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X