వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Farmers protest: ఢిల్లీ హింస, బాహుబలి ఫైటింగ్, తల్వార్ కత్తి కాంతారావ్+ 44 మంది అరెస్టు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు రిపబ్లిక్ డే రోజు దేశరాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ (ట్రాక్టర్ పరేడ్) సందర్బంగా హింస చెలరేగిన విషయం తెలిసిందే. ట్రాక్టర్ ర్యాలీ అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులను కొందరు చితకబాదేశారు. అనేక సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు 44 మందిని అరెస్టు చేశారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో తల్వార్ తో పోలీసు అధికారి భుజం నరికిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో హింస చెలరేగడానికి కారణం అయిన వారి అరెస్టులు ప్రారంభం కావడంతో కౌంట్ డౌన్ మొదలైయ్యింది.

Khiladi Sisters: విజయశాంతి లవ్ స్టోరీ, అక్కా స్కెచ్ , కేటుగాడు ఎంట్రీ, పక్కాప్లాన్ తో ఫినిష్ !Khiladi Sisters: విజయశాంతి లవ్ స్టోరీ, అక్కా స్కెచ్ , కేటుగాడు ఎంట్రీ, పక్కాప్లాన్ తో ఫినిష్ !

బాహుబలి ఫైటింగ్

బాహుబలి ఫైటింగ్


రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన వ్యవసాయ చట్టాలు మొత్తం రద్దు చెయ్యాలని కొంతకాలంగా అన్నదాతలు ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లిక్ డే రోజు ఢిల్లీ నగరంలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా బాహుబలిని తలపించే రీతిలో ఫైటింగ్ జరిగిపోయింది.

ఎవరు వాళ్లు..... ఎందుకు ఆ స్కెచ్ ?

ఎవరు వాళ్లు..... ఎందుకు ఆ స్కెచ్ ?

రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న గుడారాల్లోకి కొందరు వ్యక్తులు చొరబడి నానా హంగామా చేసి అక్కడ ఉన్న టెంట్లు, అనేక వస్తులు మొత్తం నాశనం చేశారు. ఆ సందర్బంలో కొందరు అన్నదాతలు పోలీసుల మీద తిరగబడటంతో పరిస్థితి చెయ్యిదాటిపోయింది.

పోలీసులకు చిత్రాన్నం

పోలీసులకు చిత్రాన్నం

ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా ఢిల్లీ పోలీసులు- అన్నదాతల మద్య పెద్ద వార్ జరిగింది .ఆ సమయంలో రైతుల ముసుగులో ఉన్న కొందరు ఆందోళనకారులు పోలీసులను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు. ఆ సందర్బంలో ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసి బాష్పవాయు ప్రయోగం చేశారు.

తెరమీదకు తల్వార్లు.... సీన్ రివర్స్

తెరమీదకు తల్వార్లు.... సీన్ రివర్స్

రైతులకు మద్దతు ఇస్తామని పైకి చెప్పి లోపలలోపల స్కెచ్ లు వేసిన కొందరు కేటుగాళ్లు తల్వార్లు తీసుకుని రోడ్ల మీదకు వచ్చారు. తల్వార్లతో పోలీసుల మీద దాడులు చెయ్యడానికి ప్రయత్నించారు. ఓ వ్యక్తి తల్వార్ తీసుకుని పోలీసు అధికారి ప్రదీప్ పలివాల్ భుజం నరికేయడానికి ప్రయత్నించాడు. ప్రదీప్ తో సహ వందల మంది పోలీసులకు తీవ్రగాయాలైనాయి.

కత్తి కాంతారావ్ అండ్ కో అరెస్టు

కత్తి కాంతారావ్ అండ్ కో అరెస్టు

ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా హింస చెలరేగింది. ట్రాక్టర్ ర్యాలీ అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులను కొందరు చితకబాదేశారు. అనేక సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు 44 మందిని అరెస్టు చేశారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో తల్వార్ తో పోలీసు అధికారి ప్రదీప్ మీద దాడి చేసిన కత్తి కాంతారావ్ తో సహ అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో హింస చెలరేగడానికి కారణం అయిన వారి అరెస్టులు ప్రారంభం కావడంతో కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఇంకా ఎంతమందిని పోలీసులు అరెస్టు చేస్తారో ? అనే విషయం మాత్రం వేచిచూడాలి.

English summary
Farmers protest: Delhi police arrested 44 persons including a man who attacked Alipur SHO with sword at Singhu border during tractor rally violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X