వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రకోట హింస తర్వాత మళ్లీ రైతుల ట్రాక్టర్ల ర్యాలీ -ఆగస్టు 15న భారీగా -లక్నోలోనూ ఢిల్లీ తరహా దిగ్బంధం

|
Google Oneindia TeluguNews

జాతీయ పండుగ నాడే రైతు ఉద్యమం మరో కొత్త మలుపు తిరగబోతున్నది. గణతంత్రదినోత్సవమైన జనవరి 26న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడం, ఎర్రకోటపై జాతీయ జెండాను తొలగించి, సిక్కుల జెండాను పెట్టడం, ఆ దెబ్బతో ప్రభుత్వానికి, రైతులకు మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోవడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు రైతులు మరో భారీ ట్రాక్టర్ల పరేడ్ నిర్వహించనున్నారు...

viral video:రాష్ట్రాల మధ్య కాల్పులు -భయానక విధ్వంసం -సీఎంల మాటల యుద్ధం -అమిత్ షా చెప్పినాviral video:రాష్ట్రాల మధ్య కాల్పులు -భయానక విధ్వంసం -సీఎంల మాటల యుద్ధం -అమిత్ షా చెప్పినా

వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో మోదీ సర్కార్ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురాగా, వాటిని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులుచేస్తోన్న నిరసనలు ఎనిమిది నెలలుగా కొనసాగుతున్నాయి. రాజకీయంగా బీజేపీని దెబ్బతీస్తూ, డిమాండ్ సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తోన్న రైతులు మరోసారి ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధమవుతున్నారు.

 farmers protest: Tikait calls for tractor march on i-day, siege to Lucknow, Mission UP begins

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆగస్టు 15వ తేదీన ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ సోమవారంనాడు ప్రకటించారు. 14వ తేదీన రైతులు ట్రాక్టర్లపై ఘాజిపూర్ సరిహద్దులకు చేరుకుంటారని, 15న అక్కడే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని చెప్పారు. రెండు జిల్లాల నుంచి ట్రాక్టర్లు వెళ్తాయని చెప్పారు. అవసరమైతే యూపీ రాజధాని లక్నోలోని రోడ్లను కూడా దిగ్బంధించి, ఢిల్లీ తరహాలో నిరసన శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు.

జగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలుజగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలు

రైతుల గోడును అసలేమాత్రం పట్టించుకోని బీజేపీకి వ్యతిరేకంగా 'మిషన్ యూపీ' సహా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లోనూ రైతులు ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల రాష్ట్రాలకు వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. మిషన్ యూపీలో భాగంగా తొలి సభను సెప్టెంబర్ 5న ముజఫర్‌నగర్‌లో నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని రాకేశ్ టికాయత్ చెప్పారు. కాగా,

రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు తీసిన ట్రాక్టర్ల పరేడ్ లో హింస చెలరేగడానికి బాధ్యత కేంద్రానిదేనని, ఎర్రకోటపై జాతీయ జెండాను తొలగించింది రైతులు కారని, బీజేపీ కార్యకర్తలేననే విషయం అందరికీ తెలుసని రాకేశ్ టికాయత్ అన్నారు. నిజానికి ట్రాక్టర్ ర్యాలీ తీయడం చెడ్డ పనేమీ కాదని, జాతీయ జండాతో ట్రాక్టర్లు నడపడం వల్ల ప్రజల్లో జాతీయతాభావం కూడా పెరుగుతుందని టికాయత్ వ్యాఖ్యానించారు.

English summary
Bhartiya Kisan Union's Rakesh Tikait on Monday said that the protesting farmers would go by tractors to Ghazipur border on August 14 and 15. "On August 15, we will hoist flag. Tractors from two districts will go," Tikait said. Tikait also said that the Samyukta Morcha, a coalition of over 40 unions, had decided to go to Uttarakhand, Uttar Pradesh, Punjab and other parts of the country and talk to farmers on government's policies and work. "On September 5, there will be a big panchayat in Muzaffarnagar (Uttar Pradesh). The entire country is captured," the BKU leader said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X