farmers protest: మోదీ యూటర్న్? -ఎన్నికల భయం? -అదేంలేదంటోన్న కేంద్రం -చర్చలకు సిద్ధం, కానీ
వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు ఇప్పటికే 200 రోజులు దాటాయి. కరోనా ఉధృతిని సైతం లెక్క చేయకుండా రైతులు ఉద్యమ కార్యాచరణతో ముందుకెళుతుండగా, మోదీ సర్కారు సైతం అంతే పట్టుదల ప్రదర్శిస్తోంది. కేంద్రం తీరుకు నిరసనగా ఈనెల 26న అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ లను ముట్టడించేందుకు రైతులు సిద్ధమయ్యాయి. కాగా, మొన్నటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతులంతా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం, ఇంకొద్ది రోజుల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లోనూ అదే పని చేస్తామని రైతులు హెచ్చరించిన దరిమిలా సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గిందనే వార్తలొచ్చాయి. కానీ..
covid vaccine: సెక్స్ సామర్థ్యం కోల్పోతారా? వీర్య కణాలు తగ్గుతాయా? -అధ్యయనంలో ఏం తేలిందంటే
వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం పునరాలోచనలో పడిందని, యూటర్న్ తీసుకోబోతున్నదని వస్తోన్న వార్తలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఖండించారు. ఐదు నెలల కిందట అర్ధాంతరంగా నిలిచిపోయిన చర్చల ప్రక్రియను మళ్లీ మొదలు పెడతామన్న ఆయన.. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే ప్రస్తకే లేదని కుండబద్దలు కొట్టారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడం మినహా మరే ప్రతిపాదనైనా వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తోమర్ తేల్చి చెప్పారు.

''రైతులతో మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ రైతు అయినా, ఏ రైతు సంఘమైనా ప్రభుత్వంతో నేరుగా చర్చలు చేయొచ్చు. అయితే ఒక్క మాట.. వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవడం మినహా మరే ప్రతిపాదన అయినా ప్రభుత్వంతో చర్చించవచ్చు. అలాంటి ప్రతిపాదనలు, ప్రశ్నలను స్వాగతిస్తాం'' అని కేంద్ర మంత్రి తోమర్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు.
Kerala Island: కొత్త దీవి కలకలం -Google Maps చూపిస్తున్నది నిజమేనా? -Kochi తీరంలో ఏం జరిగింది?
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గతేడాది నవంబర్ 25న ప్రారంభమైన ఈ ఆందోళన నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ విషయమై ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్య 11 విడతల చర్చలు జరిగాయి. చట్టాలను పూర్తిగా రద్దు చేసి, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సంస్కరణలు కూడా నిలిపేయాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, అందుకే కేంద్రం అసలే అంగీకరించడంలేదు. అయితే, ఇటీవల యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి రైతులు షాకివ్వడం, ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలుండటంతో రైతు ఉద్యమంపై కేంద్రం ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పని పరిస్థితి.