వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రమైన చలిలో న్యూ ఇయర్ తొలిరోజు కూడా రైతుల నిరసన .. ఆ రెండు డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదన్న అన్నదాతలు

|
Google Oneindia TeluguNews

రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు సైతం లెక్కచేయకుండా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 37వ రోజు కూడా కొనసాగుతోంది . ఎముకలు కొరికే చలిలో సరిహద్దు వద్ద బైఠాయించిన రైతులు కేంద్రంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఇక నిరసన ప్రాంతంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన రైతులు తాము ప్రభుత్వాన్ని కోరిన రెండు డిమాండ్లపై చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.

31 వ రోజుకు రైతుల ఆందోళన: కేంద్రంతో చర్చలకు రైతుల అంగీకారం, ఈ నెల 29న మరో దఫా చర్చలు31 వ రోజుకు రైతుల ఆందోళన: కేంద్రంతో చర్చలకు రైతుల అంగీకారం, ఈ నెల 29న మరో దఫా చర్చలు

 ఎముకలు కోరికే చలిలో రైతుల పోరాటం .. కేంద్రం పై నిరసన

ఎముకలు కోరికే చలిలో రైతుల పోరాటం .. కేంద్రం పై నిరసన

కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్లపై గట్టిగా పోరాటం చేస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపిన చర్చల్లో కొంత మేర పురోగతి ఉన్నా, రెండు అంశాలలో మరొకమారు ప్రతిష్టంభన నెలకొంది.వాతావరణ పరిస్థితులు రైతుల ఆందోళనకు సహకరించనప్పటికీ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కనీస ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినప్పటికీ, నవంబర్ 26 నుండి రైతులు సింగు, ఘాజిపూర్ మరియు తిక్రీ సరిహద్దు పాయింట్ల వద్ద కదలకుండా తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

రెండు డిమాండ్స్ పై స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్న రైతు సంఘం నాయకులు రెండు డిమాండ్స్ పై స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్న రైతు సంఘం నాయకులు

రెండు డిమాండ్స్ పై స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్న రైతు సంఘం నాయకులు రెండు డిమాండ్స్ పై స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్న రైతు సంఘం నాయకులు

సంయుక్త కిసాన్ మోర్చా, వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, రైతులు ప్రభుత్వం తో తరువాత చర్చించడానికి మరోమారు చర్చలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో రైతు సంఘం నాయకుడు గుర్నమ్ సింగ్ మాట్లాడుతూ, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కు చట్టపరమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్, వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలన్న 2 డిమాండ్లపై నుండి రైతులు వెనుదిరిగి ప్రశ్నేలేదని తేల్చి చెప్పారు.

నిరసన తెలిపిన వ్యవసాయ సంఘాలలో ఒకటైన అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

 చట్టాలను రద్దు చేయడానికి బదులు ప్రత్యామ్నాయం లేదన్న రైతు సంఘం నాయకులు

చట్టాలను రద్దు చేయడానికి బదులు ప్రత్యామ్నాయం లేదన్న రైతు సంఘం నాయకులు

చట్టాలను రద్దు చేయడానికి బదులు ప్రత్యామ్నాయాన్ని సూచించాలని రైతు నాయకులకు కేంద్రం చేసిన విజ్ఞప్తి అసాధ్యమని పేర్కొంది. కొత్త చట్టాలు వ్యవసాయ మార్కెట్లు, రైతుల భూమి మరియు ఆహారధాన్యాల చైన్ నియంత్రణను కార్పొరేట్‌లకు అప్పగిస్తాయి అని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తానికి చట్టాల రద్దుకు కేంద్రం ససేమిరా అంటున్నా రైతులు మాత్రం చట్టాలను రద్దు చేసే దాకా అక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.

English summary
Thousands of farmers continued their protest against the three farm laws on the first day of 2021 on Friday outside several border points of Delhi in the biting cold as they remained firm in their demands amid a deadlock with the government over two issues. Hundreds of police personnel have been deployed at Singhu, Ghazipur and Tikri border points, where the farmers have been camping since November 26, even as the minimum temperature dipped to 1.1 degrees Celsius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X