ప్రభుత్వం ఏర్పాటు చేసిన లంచ్ కు నో .. మేం భోజనం తెచ్చుకున్నామంటూ స్వాభిమానం చాటుకున్న రైతులు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఎనిమిది రోజులుగా ఆందోళన బాట పట్టిన రైతులు ఈరోజు రెండవ విడత సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తో కీలకమైన సమావేశం నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులు విజ్ఞాన్ భవన్ లో భోజన విరామ సమయంలో రైతులకు ప్రభుత్వం అందించిన ఆహారాన్ని తిరస్కరించారు. మేము మా భోజనం తెచ్చుకున్నామని పేర్కొన్న రైతు సంఘం నాయకులు దేశానికి అన్నం పెట్టే రైతన్న స్వాభిమానాన్ని చాటారు.
7వ రోజు ఢిల్లీ బోర్డర్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు: ఢిల్లీ -నోయిడా బోర్డర్ దిగ్బంధించిన రైతులు

కేంద్ర మంత్రులు ఏర్పాటు చేసిన లంచ్ కు నో అన్న రైతు ప్రతినిధులు
ఒక వ్యాన్ ద్వారా తమ ఆహారాన్ని తెచ్చుకున్న రైతులు ప్రభుత్వం అందించిన భోజనాన్ని నిరాకరించారు
.ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న రైతు సంఘం ప్రతినిధులు విజ్ఞాన భవన్ లోపల త్వరత్వరగా భోజనం చేయడానికి వారు ఏర్పాటు చేసుకున్న ఒక టేబుల్ వద్ద కనిపించారు. కొందరు నిశ్శబ్దంగా ఓ మూల నేలపై కూర్చుని తమతో పాటు తెచ్చుకున్న ఆహారాన్ని తిన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం ప్రతినిధులు కేంద్రమంత్రులు తమకు భోజనాన్ని ఏర్పాటుచేసినా తాము తిరస్కరించామని చెప్పారు.
తమ ఆహారం తామే తీసుకెళ్ళి స్వాభిమాన ప్రదర్శన
తాము తమ ఆహారాన్ని తెచ్చుకున్నామని స్వాభిమానాన్ని ప్రదర్శించారు . ప్రభుత్వం అందించే ఆహారం కానీ , టీ కానీ తమకు వద్దని రైతు నాయకులు చెబుతున్నారు. తమ డిమాండ్స్ పరిష్కరిస్తే చాలన్నారు . ఎనిమిది రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల వద్ద ఆందోళన చేస్తున్న అన్నదాతలు సమావేశం మొదటి భాగంలో తాము చెప్పదలచుకున్నది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. చట్టంలో ఉన్న లోపాలపై, వారికి ఉన్న భయాల పై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం సమావేశం రెండవ భాగంలో ప్రభుత్వ సంస్కరణలపై దృష్టి సారించనున్నారు.

వ్యవసాయ చట్టాల రద్దుకు రైతుల డిమాండ్ ... భయాందోళన తొలగించేందుకు కేంద్రం యత్నం
రైతు సంఘం ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ మరియు సోమ్ ప్రకాష్ మాట్లాడతారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, రైతులకు హానికలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చివరి అవకాశం అని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వ్యవసాయ చట్టాల విషయంలో చాలా దృఢమైన నిర్ణయంతో ఉంది. రైతులకు వ్యవసాయ చట్టాల విషయంలో భయాందోళనలు ఉన్న నేపథ్యంలో వాటిని తొలగించాలని చూస్తుంది .
మూడు వ్యవసాయ చట్టాల రద్దు పై మొండిగా ఉన్న రైతులు
రైతులను బోర్డులోకి తీసుకురావడానికి సహాయ పడే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. కనీస మద్దతు ధర విషయంలో రైతులు రాతపూర్వక హామీ కోరుతున్నారు. ఈ విషయంపై కూడా ప్రస్తుతం భేటీలో చర్చ జరగనుంది.
కాంట్రాక్ట్ వ్యవసాయం విషయంలో వివాదం వస్తే కోర్టులను ఆశ్రయించాలన్న రైతుల డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని వర్గాలు తెలిపాయి.
అయితే, రైతులు మూడు వ్యవసాయం చట్టాలను రద్దు చేయడం పై మాత్రమే మొండిగా ఉన్నారు రైతులు .
ఎవరి మీదా ఆధారపడని రైతుల స్వాభిమానానికి ఇదే ఉదాహరణ
కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం అంత ప్రయోజనకారి కాదని రైతు ప్రతినిధులు తెలిపారు.
మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసే వరకు తిరిగి వెళ్లేది లేదని, ఆందోళన కొనసాగిస్తామని, ప్రభుత్వం గట్టిగా వ్యవసాయ చట్టాల రద్దుకే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాల నాయకులు. ఇక నేడు జరిగే చర్చలు అయినా సఫలం అవుతాయా లేదా అన్నది వేచి చూడాలి.
కానీ సమావేశంలో తమ ఆహారం తామే తెచ్చుకుని రైతులు తాను ఎవరి మీదా ఆధారపడేవాడిని కాదని స్పష్టం చేశారు .