• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్రానికి మరో షాక్ -సాగు చట్టాల నిలుపుదల కాదు.. రద్దు చేయాలన్న రైతులు -26న ర్యాలీ పక్కా

|

వ్యవసాయ రంగంలో అద్భుతమైన సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలను 57వ రోజైన గురువారం కూడా కొనసాగాయి. రైతులతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చల్లో.. సాగు చట్టాలను ఏడాదిన్నరపాటు నిలుపుదల చేస్తామంటూ ప్రతిపాదించడం తెలిసిందే. అయితే, ఆ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు.

  Farmers’ Tractor Rally near the borders of Delhi | Oneindia Telugu

  జగన్ పంతం - సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ -నిమ్మగడ్డకు అనుకూల తీర్పుపై సవాల్ -రాజస్థాన్‌ రిపీట్?

  కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో పట్టు సడలించబోమని రైతు సంఘాలు మరోసారి స్పష్టం చేశాయి. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా.. ఏడాదిన్నర లేదా రెండేళ్లపాటు నిలుపుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు ముక్తకంఠంతో తిరస్కరించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చించుకున్న అనంతరం సంయుక్త కిసాన్‌ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది.

   Farmers Reject Governments Proposal To Pause Farm Laws For 1.5 Years

  సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి బుధవారం విజ్ఞాన్‌భవన్‌లో రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరగ్గా.. చట్టాలను ఒకటిన్నరేళ్లపాటు నిలుపుదల చేస్తామని కేంద్ర సర్కారు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అదే సమయంలో ఒక సంయుక్త సంఘాన్ని నియమించి ఇతర డిమాండ్ల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై తాము అంతర్గతంగా చర్చించుకుని తుది నిర్ణయం చెబుతామన్న విధంగానే రైతు సంఘాలు గురువారం ప్రకటన చేశాయి. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాయి. మరోవైపు..

  ఏపీ సీఎంగా అంజాద్‌బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొర

  సాగు చట్టాల నిలుపుదల కాదు.. రద్దు చేయాలని రైతులు స్పష్టం చేయడంతో శుక్రవారం(ఈనెల 22న) జరుగనున్న 11వ రౌండ్ చర్చలపై క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే సాగు చట్టాలపై నెలకొన్ని సమస్యలను పరిష్కరించే దిశగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే సంప్రదింపులను ప్రారంభించింది. ఇంకోవైపు గణతంత్ర దినోత్సవం రోజున(జనవరి 26న) ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి తీరుతామని రైతు సంఘాలు కరాకండిగా చెప్పాయి. రిపబ్లిక్ డే నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతివ్వబోమని ఢిల్లీ పోలీసులు చెప్పినా రైతులు ఖాతరు చేయడంలేదు.

  English summary
  Farmers protesting against the controversial farm sector laws have decided to hold out for a complete scrapping of the laws, rejecting the Centre's new proposal of putting them on hold for 18 months while negotiations continue with a fresh committee.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X