వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మీ అందరికీ సెల్యూట్’: ప్రజల ఇబ్బందులపై మోడీ స్పందన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇలాంటి ఇబ్బందులుంటాయని తాను మొదటి నుంచీ చెబుతున్నానని అన్నారు. స్వల్పకాలిక ఇబ్బందులున్నా.. నోట్ల రద్దుతో దీర్ఘ కాలిక ప్రయోజనాలుంటాయి తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు మూలంగా భవిష్యత్తులో చాలా మంచి పనులు జరుగుతాయని అన్నారు.
అంతేగాక, అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యజ్ఞంలో పాల్గొంటున్న దేశ ప్ర‌జ‌ల‌కు మోడీ సెల్యూట్ చేశారు. పెద్ద నోట్ల ర‌ద్దుకు స‌హ‌క‌రించిన ప్ర‌జ‌ల‌కు సెల్యూట్ అంటూ మోడీ ట్వీట్ చేశారు.

Farmers the economic backbone of India, note ban will benefit them: Modi

అవినీతి, ఉగ్ర‌వాదం, న‌ల్ల‌ధ‌నంకు వ్య‌తిరేకంగా చేస్తున్న య‌జ్ఞంలో ప్ర‌జ‌లు మ‌న‌స్పూర్తిగా పాల్గొంటున్నార‌ని మోడీ గురువారం పేర్కొన్నారు. డిజిట‌ల్ లావాదేవీల్లో ప్ర‌తి ఒక్క‌రు భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు. రైతులు, వ్యాపారులు, కార్మికుల‌కే దేశానికి వెన్నుముఖ అని, నోట్ల ర‌ద్దు నిర్ణయం వ‌ల్ల వాళ్ల‌కు లాభం చేకూరుతుంద‌న్నారు.

క్యాష్‌లెస్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని సూచించారు. యావ‌త్ దేశ ప్ర‌జ‌లు న‌ల్ల‌ధ‌నాన్ని ఓడించాల‌ని, దీని వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు లాభం జ‌రుగుతుంద‌ని, భ‌విష్య‌త్తు త‌రాలు కూడా లాభ‌ప‌డుతాయ‌ని పునరుద్ఘాటించారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday said that he ‘salutes’ the people of India for wholeheartedly participating in the ongoing ‘Yagna’ against corruption, terrorism and black money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X