• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ సర్కార్ పచ్చి అబద్ధాలు -చర్చలు ఫెయిల్ -4న దిగిరాకుంటే రచ్చే: రైతు సంఘాల వార్నింగ్

|

దేశ రాజధాని ఢిల్లీలో గత 15 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ.. కొత్త ఏడాది తొలి రోజే కనిష్ట ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలకు పడిపోయింది. ఆ గడ్డకట్టే చలిలోనే రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తో రైతులు చేపట్టిన ఆందోళన 37వ రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. కాగా, చర్చల విషయంలో మోదీ సర్కారు పచ్చి అబద్ధాలను, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. జనవరి 4 తర్వాతైనా సమస్యకు పరిష్కారం రాకపోతే రచ్చకు దిగుతామని హెచ్చరించారు.

భారత్‌లో వ్యాక్సిన్‌కు లైన్ క్లియర్ -సీరం తయారీ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ 'కొవిషీల్డ్‌'కు ఆమోదం

డిసెంబర్ 30న రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఆరవ విడత చర్చల్లో దాదాపుగా సగం అంశాలపై ఇరు వర్గా మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అసత్యాలని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆరవ విడత చర్చల్లో కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలకు ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని, ముందు జరిగిన ఐదు సమావేశాల్లాదే ఇదీ ముగిసిందని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.

 Farmers unions slams center, Farmers to take firm steps if Jan 4 talks fails

దాదాపుగా ఐదు గంటల పాటు జరిగిన ఆరో విడత చర్చల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరిందని, విద్యుత్తు సవరణ చట్టంతో పాటు వాయుకాలుష్యం ఆర్డినెన్సులో రైతుల అభ్యంతరాలను పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మీడియాకు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న వాదనలు ఎంత మాత్రమూ వాస్తవం కాదని స్వరాజ్ ఇండియా స్థాపకులు యోగేంద్ర యాదవ్ అన్నారు.

క్రైస్తవ జగన్, డీజీపీ సవాంగ్ -రాక్షసం -జస్టిస్ రాకేశ్‌కు నీరాజనం -సీఎంకు భయం: ఎంపీ రఘురామ

ఆందోళన చేస్తోన్న రైతులు ప్రధానంగా రెండు డిమాండ్లపై వెనక్కి తగ్గాలనుకోవడం లేదని, వ్యవసాయ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం, కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ విషయాల్లో రైతు సంఘాలు రాజీ పడబోమని యాదవ్ స్పష్టం చేశారు. ఈనెల 4న రైతు సంఘాలతో కేంద్రం ఏడో దఫా చర్చలు జరుపనున్న నేపథ్యంలో.. ఆరోజు గనుక కేంద్రం తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే నిరసనలను ఉధృతం చేస్తామన్నారు.

కుండ్లీ నుంచి మానేసర్ మీదుగా పల్వాల్ (కేఎంపీ) వరకు జనవరి 6న ర్యాలీ నిర్వహిస్తామని యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఈనెల 4న రైతులు నిరసనలు విరమిస్తారంటూ ఒక వర్గం మీడియాలో ప్రచారం అవుతుండటంపై స్పందిస్తూ.. షాహజన్‌పూర్ సరిహద్దు నుంచి ఎప్పుడు కదులుతారనే విషయం త్వరలో స్పష్టం చేయనున్నట్లు యాదవ్ తెలిపారు. అలాగే..

జనవరి 4న జరగబోయే చర్చలు గనుక విఫలం అయితే ఉద్యమ తీవ్రతను పెంచుతామని, ఆ రోజు నుంచి షాపింగ్ మాల్స, పెట్రోల్ బంకుల్ని తెరవనీయబోమని రైతు సంఘం నేత యుధ్ వీర్ సింగ్ హెచ్చరించారు. జనవరి 6న జరగబోయే ట్రాక్టర్స్ ర్యాలీలో మరోసారి సత్తా చాటుతామన్నారు. ఏడో దశ చర్చల కోసం ప్రభుత్వం సైతం సిద్ధమవుతోంది..

English summary
Farmer unions protesting against the three agri-marketing legislations on Friday threatened to shut malls and petrol pumps in Haryana if the Central government does not end the deadlock in the seventh round of talks scheduled to be held on January 4. Addressing media, Farmer leader Yudhveer Singh said that the farmers will hold tractor march on January 6 if no concrete decision is taken on the January 4 talks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X