వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘అమెరికా’పై పన్ను తప్పుడు నిర్ణయమే : ఫరూక్ అబ్దుల్లా కాంట్రవర్సీ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్ అమెరికా వస్తువులపై దిగుమతి సుంకం విధించడం తప్పుడు నిర్ణయమన్నారు. దీంతో పెద్దన్న అమెరికా చేతిలో ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలా కాకుండా సర్దుకుపోయే విధంగా వ్యవహరించాలని సూచించారు. లేదంటే భారత్‌కు నష్టమని హితవు పలికారు.

దూరం .. దూరం ...
తమ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాల అంశాలను ట్రంప్ సమావేశంలో పేర్కొన్నారని గుర్తుచేశారు ఫరూక్. కానీ మోడీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉగ్రవాదం, పాకిస్థాన్‌ను ఏకాకి చేసే అంశాలపై మాత్రం మాట్లాడాటం సరికాదని అభిప్రాయపడ్డారు. అమెరికాతో సంబంధాలు చెడితే మనకే నష్టమని గుర్తుచేశారు. ఇకనైనా నరేంద్ర మోడీ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేదంటే జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

farooq abdullah criticize modi .. support to america products, trump

కీ ఇష్యూస్ ...
మరోవైపు ఒసాకాలో జీ-20 సదస్సులో భాగంగా ట్రంప్‌తో మోడీ సమావేశం ముగిసింది. ఇరాన్ అంశం, 5 జీ నెట్‌వర్క్, వాణిజ్య, రక్షణరంగాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రక్షణ సహకారం పెరుగుదల, శాంతి సుస్థిరత కాపాడటం పలు అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగిందని వైట్ వైస్ ట్వీట్ చేసింది. మరోవైపు జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును స్వాగతిస్తున్నామని అబ్దుల్లా పేర్కొన్నారు.

అయితే ఈ చట్టంతో ఇతర రిజర్వేషన్లకు భంగం కలగొద్దని అభిప్రాయపడ్డారు. జమ్ములో అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్లు, కశ్మీర్‌లో నియంత్రణకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే యువతకు .. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈ బిల్లును సోమవారం హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టగా .. ఇవాళ అమిత్ షా ప్రసంగంతో సభ ఆమోదం తెలిపింది.

English summary
ormer chief minister of Jammu and Kashmir and National Conference chief Farooq Abdullah once again made controversial comments. Recently, India has decided to impose import tariffs on US goods. This could lead to an outrage at the hands of an elderly American. Otherwise it is advised to act in a flexible manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X