వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండేళ్ల వరకు గృహ నిర్భంధంలోనే ఫరూక్ అబ్దుల్లా.. ఇల్లే జైలు.. ఎందుకో తెలుసా..!!!

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించినప్పటీ నుంచి కశ్మీర్ లోయలో అప్రకటిత ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన భద్రతా బలగాలు ... నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు, మాజీ జమ్ముకశ్మీర్ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై మరో అస్త్రం ప్రయోగించారు. ప్రజా భద్రత చట్టం కింద హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికితోడు ఆయన ఇల్లే జైలని .. బంధవులు .. స్నేహితులను కూడా కలువొద్దని కొత్తగా ఆంక్షలు విధించారు. జమ్ముకశ్మీర్ గవర్నర్ కొత్త చర్యపై నేషనల్ కాన్ఫరెన్స్ వర్గాలు భగ్గుమంటున్నాయి.

ఆరేళ్ల చిన్నారి .. నిర్జీవంగా స్నేహితుడి ఇంట్లో ... అతనిపైనే అనుమానంఆరేళ్ల చిన్నారి .. నిర్జీవంగా స్నేహితుడి ఇంట్లో ... అతనిపైనే అనుమానం

మరో ఎత్తుగడ ..

మరో ఎత్తుగడ ..

జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అక్కడి గవర్నర్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబ ముఫ్తిని గృహ నిర్బందంలో ఉంచిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్ముకశ్మీర్ ప్రజా భద్రత చట్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఫరూక్ అబ్దుల్లాపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. దీంతో ఫరూక్ అబ్దుల్లా నిర్బంధం మరింత కఠినతరం కానుంది. అయితే జమ్ముకశ్మీర్ ప్రజాభద్రత చట్టం కింద ఒక వ్యక్తి రెండేళ్ల వరకు ఎలాంటి విచారణ జరుపకుండా నిర్బంధించే వెసులుబాటు ఉన్నది. చట్టంలో ఉన్న ఆ వెసులుబాటును ఆసరాగా చేసుకొని .. ఫరూక్ అబ్దుల్లాపై ప్రయోగించింది. ఆదివారం రాత్రి ఫరూక్ అబ్దుల్లాపై జమ్ముకశ్మీర్ పర్జా భద్రతా చట్టం ప్రయోగిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

కఠిన నిబంధనలు ..

కఠిన నిబంధనలు ..

ప్రజా భద్రత చట్టం ప్రకారం కఠిన నిబంధనలే ఉన్నాయి. ఈ చట్టం కింద ఇల్లే .. అనుబంధ జైలుగా పరిగణిస్తారు. అతను కనీసం రెండేళ్ల వరకు ఇంటిలో నిర్బంధించి ఉంచబడతారు. అయితే బంధువులు, స్నేహితులను కూడా కలుసుకోవడానికి అనుమతించరు. ఇదివరకు కశ్మీర్ నేత షా ఫెషల్‌పై కూడా జమ్ముకశ్మీర్ ప్రజా భద్రత చట్టాన్ని ప్రయోగించారు. ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లాపై ప్రయోగించారు.

సుప్రీంకోర్టులో పిల్

సుప్రీంకోర్టులో పిల్

మరోవైపు ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ కేసు విచారణ సోమవారం విచారించి. జమ్ముకశ్మీర్ ప్రజా భద్రత చట్టం విధించడంపై జమ్ముకశ్మీర్, కేంద్రం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఫరూక్ అబ్దుల్లా స్నేహితుడు ఎండీఎంకే నేత వైగో నిర్బంధంపై పిటిషన్ వేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్ఏ బోడ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకురానుంది. ఈ నెల 30న పిటిషన్ విచారిస్తారని సుప్రీంకోర్టు రిజిష్టార్ పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లాతో వైగో నాలుగు దశాబ్దాల పరిచయం ఉంది. ఈ క్రమంలోనే కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా అక్రమ నిర్బంధంపై పిటిషన్ వేశారు.

English summary
former Jammu and Kashmir chief minister and National Conference leader Farooq Abdullah has been detained under the Public Safety Act (PSA). He has been kept under house arrest at his Srinagar residence since the abrogation of Article 370 on August 5. Farooq Abdullah has now been detained under the Jammu and Kashmir Public Safety Act. PSA allows the government to detain a person for upto 2 years without a trial. The decision to slap PSA on the National Conference leader came on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X