వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లింల వల్లే, వెళ్లిపోండి: కతియార్,‘నీ తండ్రి జాగీరా?’అంటూ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Muslims should not stay in India, Kya yeh Katiyar ke baap ka desh hain

న్యూఢిల్లీ: ముస్లింలు దేశంలో ఉండాల్సిన పనిలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వినయ్‌ కటియార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ టీవీ ఛానెళ్లతో మాట్లాడుతూ.. ముస్లింల కారణంగానే దేశం విడిపోయిందన్నారు. వారి భూభాగంవాటా వారికి దక్కినందున.. పాకిస్థాన్‌కో, బంగ్లాదేశ్‌కో వెళ్లిపోవాలని అన్నారు.

వందేమాతరాన్ని గౌరవించని వారిని, జాతీయ పతాకాన్ని అవమానం చేసేవారిని, పాకిస్థాన్‌ జెండాను ఎగురవేసేవారిని శిక్షించేలా పార్లమెంటులో కొత్తచట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలోని ముస్లింలను పాకిస్తానీలు అని పిలిస్తే శిక్షించే విధంగా చట్టం తీసుకురావాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై వినయ్ కతియార్ ఈ విధంగా స్పందించారు.

నీ తండ్రి జాగీరా?: ఫరూక్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం

కాగా, ముస్లింలందరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెళ్లిపోవాలన్న బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యలపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సీరియస్ అయ్యారు. ఇదేమైనా కటియార్ అయ్య జాగీరా.. ఇది మనందరి దేశం అని అబ్దుల్లా ఘాటుగా వ్యాఖ్యానించారు.

కతియార్‌కు ఇలాంటి చెత్త వాగుడు అలాటేనని, రోజూ ఇలాగే మాట్లాడుతుంటారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు హింసను ప్రేరేపిస్తున్నారు. ఇది మత హింస కాదు. ఎందుకంటే మతాలు మనకు ప్రేమ, శాంతిని వ్యాప్తి చేయాలని మాత్రమే చెబుతాయి అని ఫరూక్ అన్నారు.

English summary
Former Jammu and Kashmir chief minister Farooq Abdullah on Thursday hit back at Vinay Katiyar for his remarks that Muslims should not stay in India, saying the BJP MP was just trying to spread hatred in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X