వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫరూఖ్ అబ్దుల్లా వాట్ ఈజ్ దిస్ : నిన్న హౌజ్ అరెస్ట్ అన్నాడు, నేడు తానే గృహ నిర్భంధంలోకి వెళ్లాడు...!

|
Google Oneindia TeluguNews

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్ధుల్లా డ్రామా రెండో రోజు కూడ కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నన్ను గృహ నిర్భంధంలో ఉంచారని తీవ్రంగా మండిపడ్డాడు. కాని పార్లమెంట్‌లో కశ్మీర్ విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత రూటు మార్చాడు. కశ్మీర్‌లో మరిన్ని ఉద్రిక్తలు తెరలేపాడు. ఈనేపథ్యంలోనే నిన్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశాడని చెప్పిన ఆయన నేడు తానే స్వతహాగా గృహ నిర్భంధంలోకి వెళ్లాడు. దీంతో పాటు ఆయనకు ఉన్న ఎస్పీజీ సెక్యూరిటిని సైతం బయటకు పంపించాడు.

 రూటు మార్చిన ఫరూక్ అబ్ధుల్లా,

రూటు మార్చిన ఫరూక్ అబ్ధుల్లా,

నిన్నటి వరకు భద్రతా దళాల నిర్భంధంలో ఉన్న ఫరూక్ అబ్ధుల్లా నేడు రూటు మార్చాడు. తనకున్న ఎస్పీజీ భద్రతను బయటకు నెట్టివేసి తానే గృహనిర్భంధంలోకి వెళ్లిపోయాడు. కశ్మీర్ విభజన తర్వాత కశ్మీర్‌లో ఎలాంటీ అల్లర్లు చెలరేగకుండా భారత భద్రతా దళాలు ముందస్తు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే పలువురు రాష్ట్ర నేతలను ఇళ్లు వదలి బయటకు రాకుండా కట్టడి చేశారు. దీంతో కశ్మీర్ నేతల హౌస్ అరెస్ట్ పై లోక్‌సభలో పెద్ద దుమారమే రేగింది. నిర్భంధంపై పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని నిలదీశారు.

నన్ను కాల్చి చంపండి అంటు కంట కన్నీరు

నన్ను కాల్చి చంపండి అంటు కంట కన్నీరు

నిన్న గృహ నిర్భంధంలో ఉన్న ఫరూక్ అబ్ధుల్లా ఆర్టికల్ రద్దుతోపాటు కశ్మీర్ విభజనపై ఉద్వేగానికి గురైయ్యారు. ఈ సంధర్భంగా కన్నీరు పెట్టుకున్నారు. ప్రాంతాలను విడదీసిన కేంద్రం ప్రజల హృదయాలను ముక్కలు చేస్తారోమో అన్నారు. ఈనేపథ్యంలోనే హిందు ముస్లింలను విభజిస్తారమో అని అవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం లౌకికవాదుల్ని చంపాలనుకుంటుందని అందుకు మేము సిద్దం అని పేర్కోన్నారు. ఈ సంధర్భంగా వెనక వైపు నుండి కాదు ముందువైపు నుండి కాల్చండి అంటూ గుండెను చూపించారు.

ప్రశాంతంగా కశ్మీర్

ప్రశాంతంగా కశ్మీర్

మరోవైపు కశ్మీర్‌ విభజన తర్వాత ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతవరణం నెలకోంది. ముఖ్యంగా భద్రతా దళాలు పూర్తి స్థాయిలో సున్నిత ప్రాంతాలను తమ ఆదీనంలో తీసుకోవడంతో ఎలాంటీ సంఘవ్యతిరేక సంఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో ప్రజల్లో విద్వేష భావాలను రెచ్చగోట్టేందుకు పాకిస్థాన్ మద్దతుదారులు కుయుక్తులు పన్నుతున్నారు. ఈనేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు కశ్మీర్ పర్యటన కూడ చేయనున్నారు. ప్రస్థుతానికి కశ్మీర్ లోయ ప్రశాంతంగానే ఉన్న పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఎలాంటీ పరిణామాలు జరుగుతాయో అనే ఉత్కంఠ మాత్రం నెలకోంది.

English summary
National Conference chief Farooq Abdullah, pushed SPG security personnel out of his house and locked himself inside a room.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X