కొడుకు పుట్టటం కోసం కూతురు బలి .. గొంతుకోసి పాశవికంగా చంపిన తండ్రి
శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలు విశ్వసిస్తున్న వారు లేక పోలేదు. మూఢనమ్మకాల మీద విశ్వాసంతో నేటికీ చాలాచోట్ల జంతు బలులు, నర బలులు కొనసాగుతున్నాయి . తాజాగా అటువంటి నరబలి ఘటనే జార్ఖండ్లో చోటు చేసుకుంది . అయితే ఈ ఘటనలో కన్నతండ్రి కూతురి పాలిట కాలయముడయ్యాడు. గొంతు కోసి అత్యంత పాశవికంగా కూతుర్ని బలి ఇచ్చాడు.
ప్రియుడి కోసం పేగు బంధాన్నే మరిచి ..కన్నకొడుకునే కడతేర్చిన కసాయి తల్లి

కూతుర్ని బలిస్తే కొడుకు పుడతాడని మూఢనమ్మకంతో దారుణం
కూతుర్ని బలిస్తే కొడుకు పుడతాడని మూఢనమ్మకంతో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. రాంచీ సమీపంలోని లోహర్దగాలోని పెష్రార్లో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి కొడుకు పుట్టాలనే కోరికతో కూతురు ఉసురు తీశాడు.
పెష్రార్ లో సమన్ నెగాసియా అనే 26 ఏళ్ల వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. సమన్కి ఎప్పటినుంచో కొడుకు పుట్టాలనే కోరిక ఉండడంతో, కొడుకు పుట్టాలంటే ఏం చేయాలి అంటూ అతను బాబాలను స్వామీజీలను ఆశ్రయించాడు.

చేతబడి చేసే వ్యక్తి చెప్పటంతో కూతుర్ని కడతేర్చిన తండ్రి
క్షుద్ర పూజలు చేస్తే కొడుకు పుడతాడు అని , అందుకోసం తన కూతురిని బలి ఇవ్వాలని చేతబడి చేసే వ్యక్తి చెప్పడంతో సమన్ కన్నబిడ్డనే కడతేర్చాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి హతమార్చాడు.
పక్కా ప్లాన్ ప్రకారం భార్యను ఆమె తల్లిగారింటికి పంపించి, ఆ సమయంలో బిడ్డను హతమార్చాడు. ఇంకా ఇంటికి తిరిగి వచ్చిన తల్లి ఈ దారుణం పై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కూతుర్ని హతమార్చిన తండ్రి నన్ను అరెస్టు చేశారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా వదలని మూఢ నమ్మకాలు
క్షుద్ర పూజలు చేసే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. క్షుద్ర పూజలు చేస్తే పిల్లలు పుడతారని, నరబలి ఇస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ తరహా మూఢనమ్మకాలు నేటి రోజుల్లోనూ పెరుగుతుండడం ఆందోళనకరం. ఇలాంటి మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం పని చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి దారుణాలు మరిన్ని వెలుగుచూసే ప్రమాదం కూడా ఉంది.