వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య అక్రమ సంబంధం, గ్యాస్ సిలిండర్ పేలి భర్త, కుమార్తెలు మృతి, ఏం జరిగిందంటే !

|
Google Oneindia TeluguNews

చెన్నై: భార్య అక్రమ సంబంధంతో విసిగిపోయి వేరుగా నివాసం ఉంటున్న వ్యక్తితో పాటు అతని కుమార్తెలు అనుమానాస్పద స్థితిలో మృతితో చెందిన సంఘటన తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలమ్ పట్టిలో జరిగింది. గ్యాస్ సిలండర్ పేలడంతో కరుప్పయ (37), ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రదీప (7), హేమలతా (5) అనే ముగ్గురు గ్యాస్ సిలిండర్ పేలడంతో మరణించారని పోలీసులు మొదట కేసు నమోదు చేశారు. అయితే భార్య అక్రమ సంబంధంతో అవమానంతో కరుప్పయ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడా, ఆకస్మికంగా గ్యాస్ సిలిండర్ పేలి మృతి చెందారా ?, ఎవరైనా కావాలనే గ్యాస్ సిలిండర్ పేల్చి హత్య చేశారా ? అనే విషయం పోలీసులు విచారణ చేశారు. చివరికి గీతా తన ప్రియుడితో కలిసి గ్యాస్ సిలిండర్ పేల్చి భర్త, కుమార్తెలను హత్య చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

మంచం, టీవీ స్టాండ్ వెనుక సీక్రెట్ రూమ్స్: హైటెక్ వ్యభిచారం, ఎస్కేప్ బాబు ప్లాన్స్, చివరికి!మంచం, టీవీ స్టాండ్ వెనుక సీక్రెట్ రూమ్స్: హైటెక్ వ్యభిచారం, ఎస్కేప్ బాబు ప్లాన్స్, చివరికి!

ఆయన

ఆయన

మదురై జిల్లాలోని ఉసిలమ్ పట్టి సమీపంలో కరుప్పయ, ఆయన భార్య గీతా, కుమార్తెలు ప్రదీప, హేమలతా నివాసం ఉంటున్నారు. కరుప్పయ ఇంటి సమీపంలో టీ షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజూ వేకువ జామున కరుప్పయ ఇంటి నుంచి టీ షాప్ కు వెళ్లి రాత్రి తిరిగి వస్తుంటాడు.

 భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

భార్య గీతా ప్రవర్తన మీద కరుప్పయకు అనుమానం ఉంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకునితో గీతా సన్నిహితంగా ఉంటుందని కరుప్పయకు తెలిసింది. నీ ప్రవర్తన మార్చుకోవాలని కరుప్పయ చాలసార్లు భార్య గీతాను హెచ్చరించాడు.

 పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు

పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు

భార్య గీతా మీద అనుమానంతో కరుప్పయ ఇంటిలో చాలాసార్లు గొడవపడ్డాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. పోలీసులు పంచాయితీ చేసి కరుప్పయ, గీతా దంపతులకు కౌన్సింగ్ ఇచ్చారు. అయినా ఫలితం లేదు. గీతా భర్త, కుమార్తెలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.

టీ దుకాణం

టీ దుకాణం

కురప్పయ ఇద్దరు కుమార్తెలతో కలిసి కురుప్పయ తొట్టప్ననాయక్కనూర్ లో వేరుగా నివాసం ఉంటున్నాడు. ఇంటి సమీపంలో కురప్పయ టీ దుకాణం ప్రారంభించాడు. గురువారం ఉదయం కరుప్పయ కుమార్తెలతో కలిసి టీ దుకాణం ప్రారంభించాడు. ఆ తరువాత అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.

 సజీవదహనం

సజీవదహనం

గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో టీ దుకాణంలో ఉన్న కరుప్పయ, ఆయన కుమార్తెలు ప్రదీపా, హేమలతా అక్కడిక్కడే సజీవదహనం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టుం నిమిత్తం మదురై జిల్లా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు.

 భార్య, ప్రియుడు !

భార్య, ప్రియుడు !

భార్య గీతా అక్రమం సంబంధం కొనసాగించి తన పరువు తీసిందని ఆవేదనతో కరుప్పయ గ్యాస్ సిలిండర్ లీక్ చేసి కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడా ? ఆకస్మికంగా గ్యాస్ సిలిండర్ పేలి మృతి చెందారా ? అని పోలీసులు ఆరా తీశారు. అయితే గీతా అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తితో కలిసి గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రాంతంలో కిరోసిన్ పోసి నిప్పంటించదని, ఆ సమయంలో సిలిండర్ పేల్చి భర్త, కుమార్తెలను హత్య చేసిందని వెలుగు చూసింది. ఈ కేసులో ఇప్పటికే గీతాతో సహ ముగ్గురిని పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
Tamil Nadu: Father died along with his two daughters and three arrested connection cylinder explosion in usilampatti near Madurai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X