• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కన్నబిడ్డకు మత్తు మందిచ్చి ఏడాదిగా అత్యాచారం చేస్తున్న తండ్రి .. ముగ్గురు కూతుళ్ళకు వేధింపులు

|

నాన్న అంటే అండగా ఉండేవాడు. బిడ్డలకు రక్షణ కల్పించేవాడు. విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైన భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన వాడు .. అలాంటి తండ్రి, కన్నకూతురినే కాటేశాడు. కామం కళ్లను కప్పేయడంతో కోరిక తీర్చుకోడానికి స్వయంగా కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.అది ఒకసారి కాదు సంవత్సర కాలంగా మత్తు మందు ఇచ్చి కుమార్తెపై పైశాచిక దాడికి తెగబడ్డాడు. అంతే కాదు ముగ్గురు కుమార్తెలను లైంగిక వేధింపులకు గురి చేశాడు ఆ మానవ మృగం. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

చిన్నారుల అత్యాచారానికి ఉరిశిక్ష... చట్టాన్ని సవరించనున్న కేంద్రం

కన్న కూతురిపై అత్యాచారం చేసిన కామాంధుడైన తండ్రి

కన్న కూతురిపై అత్యాచారం చేసిన కామాంధుడైన తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడిన దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌ రాష్ట్రం శివపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు. భర్త తీరు నచ్చక భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ముగ్గురు ఆడపిల్లలు తండ్రి వద్దే ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తెకు 16 ఏళ్లు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి కన్న బిడ్డపైనే పైశాచిక క్రీడకు ఒడిగట్టాడు . ఏకంగా సవత్సరం పాటు పెద్ద కుమార్తె కు నిత్యం రాత్రి మత్తు మందిచ్చి అత్యాచారం చేసేవాడు. అంతటితో అతనిలోని రాక్షసుడు ఆగలేదు .

అత్యాచారం చేస్తూ వీడియోలు .. వాటిని చూపించి మిగతా ఇద్దరు కూతుళ్ళపై లైంగిక వేధింపులు

అత్యాచారం చేస్తూ వీడియోలు .. వాటిని చూపించి మిగతా ఇద్దరు కూతుళ్ళపై లైంగిక వేధింపులు

ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి కూతురిపై అత్యాచారం చేసేవాడు. నిద్రమాత్రలిచ్చి కామవాంఛ తీర్చుకునేవాడు .కాపాడాల్సిన తండ్రే అలా చేస్తుంటే దిక్కుతోచని స్థితిలో బాలిక అల్లాడిపోయింది. అంతే కాదు ఆమెను అత్యాచారం చేస్తున్న వీడియోలు తీసి మిగతా ఇద్దరు పిల్లలకు చూపించి వారిని సైతం లైంగిక ఇబ్బందులకు గురి చేసేవాడు. దీంతో వారు తండ్రి పేరు ఎత్తితేనే గజగజా వణికిపోయేవారు.

ఓ ఇంట్లో పని చేస్తున్న చిన్న కూతురు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని

ఓ ఇంట్లో పని చేస్తున్న చిన్న కూతురు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని

ఈ నేపథ్యంలో ఇతని మూడో కూతురు ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఇంటి యజమానురాలు ఆ అమ్మాయిని ఆమె తండ్రి గురించి అడిగితే చెప్పటానికి భయపడింది. అది గమనించిన ఇంటి యజమానురాలు తండ్రి పేరు చెబితే అంతగా భయపడుతుండడంతో అసలు విషయం ఏంటి అని ఆరా తీసింది. తల్లి పుట్టింటికి వెళ్ళిపోవటం , తండ్రి దగ్గర ఉంటె పెడుతున్న లైంగిక వేధింపులు ఆ ఆమ్మాయి ఆ యజమానురాలికి చెప్పింది. బాదితురాలైన ఆమ్మాయి చెప్పిన విషయాలు విని ఆమె షాక్ తింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పెద్ద కుమార్తెను విచారించి విషయం తెలుసుకుని, ఆమె ఇచ్చిన ఆధారాల మేరకు ఆ మానవ మృగాన్ని అరెస్టు చేశారు.

 ఈ పశుప్రవృత్తికి చెక్ పెట్టాలి.. కన్నబిడ్డలనే కాటేసే వారికి కఠిన శిక్షలు వెయ్యాలి

ఈ పశుప్రవృత్తికి చెక్ పెట్టాలి.. కన్నబిడ్డలనే కాటేసే వారికి కఠిన శిక్షలు వెయ్యాలి

రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అన్న విచక్షణ మరిచి పశువుల్లా తండ్రులు ప్రవర్తిస్తున్న ఘటనలు మన సమాజంలో రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. సమాజంలో రక్త సంబంధాలకు, అనుబంధాలకు కూడా విలువలు లేకుండా పోతున్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ కన్నా బిడ్డల్నే కాటేస్తున్న, పశువుల్లా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన శిక్షలు అమలు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
In a heart-wrenching incident, a 16-year-old girl was allegedly held captive and raped by her father in Madhya Pradesh.A man from Shivpur in Madhya Pradesh has a wife and three daughters. Husband did not like his wife so, she went to her parents house. Three girls stay near the father. Their eldest daughter is 16 years old. The man who closed his eyes with lust, started playing the devil game on the child. For a year, the elder daughter was drugged and raped on a regular basis. He also taken the rape videos and blackmailed his another two daughters. he sexually harassed the three daughters .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more