కన్నబిడ్డకు మత్తు మందిచ్చి ఏడాదిగా అత్యాచారం చేస్తున్న తండ్రి .. ముగ్గురు కూతుళ్ళకు వేధింపులు
నాన్న అంటే అండగా ఉండేవాడు. బిడ్డలకు రక్షణ కల్పించేవాడు. విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైన భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన వాడు .. అలాంటి తండ్రి, కన్నకూతురినే కాటేశాడు. కామం కళ్లను కప్పేయడంతో కోరిక తీర్చుకోడానికి స్వయంగా కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.అది ఒకసారి కాదు సంవత్సర కాలంగా మత్తు మందు ఇచ్చి కుమార్తెపై పైశాచిక దాడికి తెగబడ్డాడు. అంతే కాదు ముగ్గురు కుమార్తెలను లైంగిక వేధింపులకు గురి చేశాడు ఆ మానవ మృగం. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
చిన్నారుల అత్యాచారానికి ఉరిశిక్ష... చట్టాన్ని సవరించనున్న కేంద్రం

కన్న కూతురిపై అత్యాచారం చేసిన కామాంధుడైన తండ్రి
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడిన దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు. భర్త తీరు నచ్చక భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ముగ్గురు ఆడపిల్లలు తండ్రి వద్దే ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తెకు 16 ఏళ్లు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి కన్న బిడ్డపైనే పైశాచిక క్రీడకు ఒడిగట్టాడు . ఏకంగా సవత్సరం పాటు పెద్ద కుమార్తె కు నిత్యం రాత్రి మత్తు మందిచ్చి అత్యాచారం చేసేవాడు. అంతటితో అతనిలోని రాక్షసుడు ఆగలేదు .

అత్యాచారం చేస్తూ వీడియోలు .. వాటిని చూపించి మిగతా ఇద్దరు కూతుళ్ళపై లైంగిక వేధింపులు
ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి కూతురిపై అత్యాచారం చేసేవాడు. నిద్రమాత్రలిచ్చి కామవాంఛ తీర్చుకునేవాడు .కాపాడాల్సిన తండ్రే అలా చేస్తుంటే దిక్కుతోచని స్థితిలో బాలిక అల్లాడిపోయింది. అంతే కాదు ఆమెను అత్యాచారం చేస్తున్న వీడియోలు తీసి మిగతా ఇద్దరు పిల్లలకు చూపించి వారిని సైతం లైంగిక ఇబ్బందులకు గురి చేసేవాడు. దీంతో వారు తండ్రి పేరు ఎత్తితేనే గజగజా వణికిపోయేవారు.

ఓ ఇంట్లో పని చేస్తున్న చిన్న కూతురు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని
ఈ నేపథ్యంలో ఇతని మూడో కూతురు ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఇంటి యజమానురాలు ఆ అమ్మాయిని ఆమె తండ్రి గురించి అడిగితే చెప్పటానికి భయపడింది. అది గమనించిన ఇంటి యజమానురాలు తండ్రి పేరు చెబితే అంతగా భయపడుతుండడంతో అసలు విషయం ఏంటి అని ఆరా తీసింది. తల్లి పుట్టింటికి వెళ్ళిపోవటం , తండ్రి దగ్గర ఉంటె పెడుతున్న లైంగిక వేధింపులు ఆ ఆమ్మాయి ఆ యజమానురాలికి చెప్పింది. బాదితురాలైన ఆమ్మాయి చెప్పిన విషయాలు విని ఆమె షాక్ తింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పెద్ద కుమార్తెను విచారించి విషయం తెలుసుకుని, ఆమె ఇచ్చిన ఆధారాల మేరకు ఆ మానవ మృగాన్ని అరెస్టు చేశారు.

ఈ పశుప్రవృత్తికి చెక్ పెట్టాలి.. కన్నబిడ్డలనే కాటేసే వారికి కఠిన శిక్షలు వెయ్యాలి
రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అన్న విచక్షణ మరిచి పశువుల్లా తండ్రులు ప్రవర్తిస్తున్న ఘటనలు మన సమాజంలో రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. సమాజంలో రక్త సంబంధాలకు, అనుబంధాలకు కూడా విలువలు లేకుండా పోతున్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ కన్నా బిడ్డల్నే కాటేస్తున్న, పశువుల్లా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన శిక్షలు అమలు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.