వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఐటీకి పంపించి తప్పు చేశా..: ఢిల్లీ పీహెచ్‌డీ విద్యార్థి మృతిపై తండ్రి ఆవేదన!

సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందుకోసం రూ.25లక్షలు తీసుకోవాల్సిందిగా తమ కూతురిపై రితేశ్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో మంజుల అనే పీహెచ్‌డీ విద్యార్థి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కుమార్తె ఆత్మహత్య పట్ల తాజాగా ఆమె తండ్రి స్పందించారు. అసలు తన కుమార్తెను ఉన్నత చదువులకు పంపించకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న వయసులోనే తమ కూతురికి పెళ్లి చేసి తప్పు చేశామన్నారు. జాతకాలు కలిశాయని పెళ్లి చేస్తే.. ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. అల్లుడు రితేశ్ కు తమ కూతురు చదువుకోవడం ఇష్టం లేదని, చదువు మానేయాలని తరుచూ ఒత్తిడి తెచ్చేవాడని పేర్కొన్నారు.

Father of Ph.D. student, who committed suicide in Delhi campus, says it was a mistake to send his daughter to IIT

సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందుకోసం రూ.25లక్షలు తీసుకోవాల్సిందిగా తమ కూతురిపై రితేశ్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కేవలం కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతోనే తమ కూతురు విడాకుల జోలికి వెళ్లలేదన్నారు. కట్నం ఇచ్చేందుకు తాను డబ్బు కూడబెట్టి ఉండాల్సిందన్నారు.

కాగా, గతంలో అమెరికాలో సివిల్ ఇంజనీర్ గా పనిచేసిన మంజుల 2011లో ఢిల్లీ ఐఐటీలో చేరింది. జలవనరులపై ఆమె పరిశోధన సాగిస్తోంది. ఇటీవల క్యాంపస్ ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మంజుల ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకుని, ఆమె మొబైల్ ఫోన్ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు.

English summary
Awaiting his daughter's body outside a hospital's mortuary, the father of Manjula Devak, who committed suicide under mysterious circumstances in the Indian Institute of Technology (IIT) Delhi campus on Tuesday, said on Wednesday that it was a mistake to educate her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X