• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Father's Day 2020 : నాన్నే సూపర్ హీరో.. పోస్టులు, గిఫ్టులు కాదు .. నాన్నకు కావాల్సిందిదే !!

|

నాన్న... ప్రతి ఒక్కరికి ఒక సూపర్ హీరో.. పిల్లలు తమ జీవితంలో ఎవరినైనా అనుసరిస్తారు,అనుకరిస్తారు,ఆదర్శంగా తీసుకుంటారు అంటే అది నాన్ననే .. ఎవరూ తెలియని ఈ లోకంలో ఒక ముద్దు యువరాజుగానో, యువరాణి గానో మనల్ని పరిచయం చేసి, మన తప్పటడుగులను , తప్పుటడుగులను దిద్ది , మనల్ని పోషించి, చదివించి సమాజానికి మనల్ని ఉన్నతంగా పరిచయం చేసే నాన్నే మన సూపర్ హీరో. అలాంటి నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వన్ ఇండియా అందించే ప్రత్యేక కథనం.

ఫాదర్స్ డే పుట్టిందిలా

ఫాదర్స్ డే పుట్టిందిలా

ఇక ఫాదర్స్ డే విషయానికి వస్తే అమెరికాకు చెందినసోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ తండ్రి గొప్పతనాన్ని తెలియజేయడానికి, నాన్నకు గౌరవార్ధం గా ఒకరోజు ఉండాలని మొదలు పెట్టిన ప్రచారం కార్యరూపం దాల్చి ఫాదర్స్ డే గా మారింది. ఇక ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910 వ సంవత్సరంలో మొదటి సారిగా ఫాదర్స్ డే జరుపుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

ప్రస్తుతం తల్లిదండ్రులకు కష్టకాలం

ప్రస్తుతం తల్లిదండ్రులకు కష్టకాలం

ఫాదర్స్ డే... ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలలో తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.అమ్మ కోసం మదర్స్ డే లాగా, నాన్న కోసం కూడా ఒక రోజు కావాలని ఫాదర్స్ డే ని నిర్వహిస్తున్నారు. అయితే మనదేశంలో ఫాదర్స్ డే ను జరుపుకోవడం అంత అవసరమా అంటే ప్రస్తుత కాలంలో తమ పిల్లల జీవితం కోసం, భవిష్యత్తు కోసం ఎంతో త్యాగం చేస్తున్న తండ్రులను చాలామంది నిర్లక్ష్యంగా చూస్తున్నారు. తండ్రి గొప్పతనాన్ని చాలామంది గుర్తించడం లేదు.

నాన్నలను అనాధలుగా ఆశ్రమాలకు పంపుతున్న పిల్లలు

నాన్నలను అనాధలుగా ఆశ్రమాలకు పంపుతున్న పిల్లలు

ఇక చాలామంది వృద్ధాప్యంలోకి వచ్చిన తండ్రులను నిర్ధాక్షిణ్యంగా అనాధాశ్రమాలకు చేరుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫాదర్స్ డే జరుపుకోవడం, నాన్న గొప్పతనాన్ని గుర్తుచేసుకోవడం, ఆయన వల్లే మనం ఈరోజు గొప్పగా బ్రతుకుతున్నాము అనే విషయాన్ని గుర్తించడం అవసరమేమో అనే భావన కలుగుతుంది. కుటుంబ బాధ్యతను, బిడ్డల ఉన్నతిని కాంక్షించి నిత్యం శ్రమించే శ్రమజీవి నాన్న. పిల్లలు అడిగితే, తనకు కష్టసాధ్యమైనప్పటికీ తెచ్చి ఇచ్చే నాన్న గొప్పతనం ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు.

 నాన్న త్యాగ జీవి

నాన్న త్యాగ జీవి

పిల్లల కళ్ళల్లో ఆనందం కోసం, వారి ముఖంలో చిరునవ్వు చూడడం కోసం నాన్న తన సర్వస్వాన్నీ త్యాగం చేస్తాడు. పిల్లల ఉన్నతి కోసం వెట్టిచాకిరీ చేస్తాడు. బాధ్యతగా చివరివరకూ బిడ్డల కోసం అండగా నిలిచే గొప్ప వ్యక్తిత్వం నాన్నది. అలాంటి నాన్న త్యాగ జీవి. తనకంటే తనవారి క్షేమాన్ని కాంక్షించి అనుక్షణం పనిచేసే కష్టజీవి. అందుకే ప్రతి ఇంట్లో పిల్లలు సూపర్ హీరో నాన్నే. ఈ రోజు ప్రతి ఒక్కరూ తాము సాధించిన ఘనత గురించి చెప్పుకుంటూ, సమాజంలో ఉన్నతంగా బ్రతుకుతున్నారు అంటే అందుకు మూలం నాన్న ఇచ్చిన స్ఫూర్తి.

నాన్న గొప్పతనం చెప్తే చాలదు ... గొప్పగా చూసే గుణం ఉండాలి

నాన్న గొప్పతనం చెప్తే చాలదు ... గొప్పగా చూసే గుణం ఉండాలి

ఫాదర్స్ డే వచ్చిందంటే చాలు ఫేస్బుక్ లో పోస్టులు, వాట్సాప్ లో స్టేటస్ లు , ట్విట్టర్లో ట్వీట్లు తండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్తూ తెగ పోస్టులు చేస్తూ ఉంటారు. ఇక కొందరు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇక అలాంటి వారంతా గుర్తించాల్సింది తండ్రి గొప్పతనం చెప్పడం మాత్రమే కాదు,తన కోసం ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తండ్రి పట్ల కాసింత ప్రేమాభిమానాలను చూపించడం. అందరూ తమ జీవితంలో గొప్పగా ఎదగడానికి కారణమైన, చిన్నప్పటి నుండి మన కోసం కష్ట పడిన తండ్రిని గౌరవిస్తే, వారిని ప్రేమిస్తే, వారి త్యాగాలను గుర్తిస్తే, వృద్ధాప్య దశలో వారికి చేదోడుగా నిలిస్తే ఆ తండ్రికి కావాల్సింది ఇంకేముంది.

  Father's Day 2020: నాన్నే సూపర్ హీరో.. పోస్టులు, గిఫ్టులు కాదు .. నాన్నకు కావాల్సిందిదే !!
  అప్పుడు ప్రతి రోజూ హ్యాపీ ఫాదర్స్ డేనే !!

  అప్పుడు ప్రతి రోజూ హ్యాపీ ఫాదర్స్ డేనే !!

  తండ్రిని గౌరవించడం, ప్రేమించడం తప్ప ఫాదర్స్ డే సందర్భంగా మన నాన్న కు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందేముంది. ప్రపంచానికి చెప్పాల్సిందేముంది. నాన్నను గౌరవించటానికి ఫాదర్స్ డే అవసరం లేదు . నాన్న గొప్పతనం చెప్పటానికి ఇది ఒక సందర్భం మాత్రమే .. నాన్నను ప్రేమించటానికి ఒక్కరోజు మాత్రమే చాలదు, ప్రతిరోజు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం కృతజ్ఞులమై ఉండాలి. మనం ఎంతో ప్రేమానురాగాలతో పెంచిన వారిపట్ల మనం చూపించాల్సింది కూడా ప్రేమే కదా . జన్మనిచ్చిన అమ్మను , నీడగా నిలిచి రక్షించిన నాన్నను ఆదరించి మీరు నడిచే మార్గమే రేపు మీ పిల్లలకు ఆదర్శం .. ఇంకేం నాన్నను సూపర్ హీరోగా చూసి మీరు కూడా మీ పిల్లలకు సూపర్ హీరోలవ్వండి . ఇక అందరూ అలాగే ఉంటే అప్పుడు ప్రతి రోజూ హ్యాపీ ఫాదర్స్ డేనే !!

  English summary
  praying and surprising yearly once is not necessary for the children who are scold the father throughout the year . They want the children who respect and love him. Every day dad support us, stays for us , pray for us, he fight for us. It is the father's mind that is always thinking about children's growth. Everyone should love father.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X