బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజనీరింగ్ చదివే కూతురు వీడియోలు తీసి లైంగిక వేధింపులు, తండ్రికి 10 ఏళ్లు జైలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంజనీరింగ్ చదివే కన్న కూతురు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి లైంగికంగా వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్యకు కారణం అయిన కసాయి తండ్రికి న్యాయస్థానం 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విదించింది. కామాంధుడిని అతని భార్య పోలీసులకు పట్టించింది.

పోలీసులు అని నమ్మించి ఫ్రెండ్ ని కట్టేసి యువతికి లైంగిక వేధింపులు, రూ. 20 వేలు!పోలీసులు అని నమ్మించి ఫ్రెండ్ ని కట్టేసి యువతికి లైంగిక వేధింపులు, రూ. 20 వేలు!

కూతురు స్నానం చేస్తుంటే !

కూతురు స్నానం చేస్తుంటే !

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురంలో నివాసం ఉ:టున్న పాండురంగ (54) అనే కామాంధుడు జైలుకు వెళ్లాడు. పాండురంగకు ఇంజనీరింగ్ చదివవే కుమార్తె ఉండేది. కుమార్తె స్నానం చేస్తున్న సమయంలో పాండురంగ రహస్యంగా చాలసార్లు వీడియోలు తీశాడు.

లైంగిక కోరిక తీర్చాలని టార్చర్

లైంగిక కోరిక తీర్చాలని టార్చర్

నగ్నంగా ఉన్న వీడియోలు కుమార్తెకు చూపించిన పాండురంగ తన లైంగిక కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశాడు. తండ్రి పెడుతున్న లైంగిక చిత్రహింసలకు ఆమె తట్టుకోలేకపోయింది. ఇంజనీరింగ్ కాలేజ్ లో తనతోపాటు చదువుతున్న ఓ అమ్మాయికి విషయం చెప్పి విలపించింది.

చిత్రహింసలతో ఆత్మహత్య

చిత్రహింసలతో ఆత్మహత్య

ఇంటిలో నిత్యం తండ్రి లైంగిక వేధింపులు తట్టుకోలేని యువతి 2013 నవంబర్ 28వ తేదీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, పోలీసులు భావించారు. నెల తరువాత పాండురంగ భార్యకు యువతి స్నేహితురాలు అసలు విషయం చెప్పింది.

పోలీసులకు పట్టించిన భార్య

పోలీసులకు పట్టించిన భార్య

తన భర్త పాండురంగ వేధింపుల కారణంగా తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి చిక్కబళ్లాపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పాండురంగ మొబైల్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా కుమార్తె స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు వెలుగు చూశాయి.

కోర్టుకు వీడియోలు, సాక్షాలు

కోర్టుకు వీడియోలు, సాక్షాలు

యువతిని ఆమె తండ్రి పాండురంగ లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు న్యాయస్థానంలో నివేదిక, మొబైలో ఉన్న వీడియోలు, సాక్షాలు సమర్పించారు. ఆరు సంవత్సరాలు విచారణ చేసిన న్యాయస్థానం కామాంధుడు పాండురంగ నేరం చేశాడని రుజువు కావడంతో 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా విధించింది.

English summary
A Man who Sexually harassed his daughter and influenced her to kill her self sent to Jail for 10 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X