వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ హత్య కుట్ర కేసులో ఎఫ్‌బీఐ విచారణ..

|
Google Oneindia TeluguNews

ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఆయనపై హత్య కుట్రను తేల్చేందుకు అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ సహకారాన్ని తీసుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు సిద్దమయ్యారు. ముఖ్యంగా హత్య కుట్ర బయటపడిన అనంతరం విరసం నేత వరవరరావును అరెస్ట్ చేసి ఆయన ఇంట్లో లభించిన హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే అవి పూర్తి ధ్వసం కావడంతో వాటిలో ఉన్న డాటాను వెలికి తీసేందుకు అంత్యంత సాంకేతిక ఉన్న ఎఫ్‌బీఐ సహాకారం తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

విరసం నేత వరవరరావు అరెస్ట్

విరసం నేత వరవరరావు అరెస్ట్

బీమా కోరేగావ్ అల్లర్లు అనంతరం మోడీ హత్యకు ప్లాన్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మావోయిస్టులతో కలిసి ప్రధాని మోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగంతో విరసం నేత వరవరరావును 2018లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంధర్భంగా ఆయన ఇంట్లో హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి ధ్వంసం అయి ఉన్నాయి. దీంతో వాటి నుండి ఎలాంటీ డాటా పోలీసులకు లభ్యం కాలేదు.

డాటా కోసం పోలీసుల తంటాలు

డాటా కోసం పోలీసుల తంటాలు

దీంతో వాటి నుండి డాటాను రాబెట్టేందుకు ముంబయి మరియు గుజరాత్ , మరియు హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నుండి ప్రయత్నాలు చేశారు. కాని ఎలాంటీ సమాచారాన్ని రాబట్టలేకపోయారు. అయితే ధ్వంసం అయిన హర్డ్ డిస్క్‌లతో పాటు కుట్ర కేసుల్లో అధునూతన సాంకేతికతను ఉపయోస్తున్న అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ సాయాన్ని తీసుకోవాలని పూణే పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కేంద్ర హోంశాఖను అనుమతులు కోరారు. దీంతో హోంశాఖ అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అమెరికా వెళ్లి డాటాపై విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించారు.

2017 డిసెంబర్ లో హత్యకు కుట్ర

2017 డిసెంబర్ లో హత్యకు కుట్ర

కాగా సంఘటన 2017 డిసెంబరు 31న పుణెలో ఎల్గర్‌లో పరిషత్ సమ్మేళనం జరిగింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల సహకారంతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసుల అభియోగం.. అనంతరం వారి ప్రసంగాలతోనే తర్వాతి రోజు భీమా కోరెగావ్ మెమెరియల్ వద్ద హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పుణె పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. ఎల్గర్ పరిషత్ సమ్మేళనంలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిగిందని.. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడం, కేంద్రతో యుద్ధం చేయడం వంటి అంశాలపై అక్కడ చర్చ జరిగినట్లు ఆరోపణలు చేస్తూ... కేసు నమోదు చేశారు. కాగా ఈ విచారణలో పలువురు మావోయిస్టుల మద్దతుదారులతో పాటు వరవరరావు పేరు బయటకు రావడంతో ఆయన్ను 2018 జూన్‌లో అరెస్ట్ చేశారు.

English summary
The Murder conspiracy case of Prime Minister Narendra Modi have major turning. The Maharashtra police was ready to take the FBI's cooperation for data analyze.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X