వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

sex workers పాలిట శాపంగా కరోనా, విటులు లేక, ఆదాయం రాక నరకయాతన, 2 వేల మంది వేశ్యలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం సెక్స్ వర్కర్ల జీవితాన్ని మరింత ఛిద్రం చేసింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో రాజధాని నగరాల నుంచి జనం తమ సొంత రాష్ట్రాలకు వెళుతున్నారు. ఇక దేశ రాజధానిలో ఉన్న సెక్స్ వర్కర్ల వెతలు అన్నీ ఇన్నీ కావు. విటులు లేక, ఆదాయం రాక.. సగం కడుపుకే తినాల్సి వస్తోందని చెబుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వేశ్యలను 'ఇండియా టుడే' ప్రతినిధి మాట్లాడారు. వారి బాధను ప్రజల ముందు ఉంచారు.

2 వేల మంది వేశ్యలు

2 వేల మంది వేశ్యలు

జీబీ రోడ్డులో గల అజ్మీర్ గేట్ నుంచి లాహోర్ గేటు వరకు గల కిలోమీటర్ మేర వంద వరకు వేశ్యవాటికలు మూతపడ్డాయి. బహుళ అంతస్తుల భవనాల్లో 4 వేల మంది వేశ్యలు ఉన్నారు. అందులో సగం వరకు ఇతర ప్రాంతాలకు వెళ్లగా.. 2 వేల మంది మాత్రం అక్కడే ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వేశ్య వాటికలను మూసివేయడంతో గోళ్లు పిక్కుంటూ ఉన్నారు.

పట్టించుకోరు..

పట్టించుకోరు..

వేశ్య వాటికలో ఉన్న రష్మి (పేరు మార్చబడింది)తో ఇండియా టుడే ప్రతినిధి మాట్లాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో తమ జీవితాల్లో వెలుగు లేదని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల కోసం కిరాణా షాపు, ఆరోగ్యం బాగోలేకుంటే మెడికల్ షాపుకు వెళ్లే వీలు కూడా లేదని వాపోయారు. ఒకవేళ వైద్యులకు కాల్ చేసిన వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ముసుగు వేసుకొని కూడా తమ వద్దకు వచ్చి ట్రీట్ మెంట్ చేయరని పేర్కొన్నారు. పోలీసులు కూడా తమ బాధను వినరని నిట్టూర్చారు. తన వద్ద ఉన్న కొంత నగదుతో నెట్టుకొస్తున్నానని.. ఎలా గడుపుతున్నానో తనకే తెలియదని చెప్పారు. లాక్ డౌన్ ఎప్పుడూ తీసివేస్తారో కూడా తెలియదని ఆమె వివరించారు. రష్మీ లాంటి చాలా మంది పేదరికంతో బాధపడి.. వేశ్య వాటికల్లో చేరారు. ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో వారి బతుకు ఛిద్రమైపోయింది.

పాలు పట్టలేని దుస్థితి

పాలు పట్టలేని దుస్థితి


మరో వేశ్య మంజరి (పేరు మార్చాం) తన నెల చిన్నారితో బ్రోతల్ హౌస్‌లో ఉంటున్నారు. జార్ఖండ్ శివారులో గల కుగ్రామం నుంచి వచ్చిన ఆమె.. తన కుటుంబాన్ని గడిపేందుకు తప్పడం లేదనిచెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో వేశ్య వాటిక యాజమాని వెళ్లిపోయాడని.. బ్రోతల్ హౌస్ మూసివేయడంతో తాను ఇక్కడే ఎలాంటి ఉపాధి లేకుండా ఉండిపోయామని చెప్తున్నారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే పడుపు వృత్తిలోకి దిగామని,, దాంతో సర్దుకొని జీవిస్తున్నామని పేర్కొన్నారు. తనకు వచ్చే డబ్బులతో తన నెలల బిడ్డకు కడుపునిండా పాలుకూడా పట్టలేని పరిస్థితి అని మంజరి పేర్కొన్నారు. భారతదేశంలో సమాజానికి అవల ఉన్న తమను ఎవరూ పట్టించుకోరు అని.. ప్రభుత్వాలు కూడా లెక్కచేయవన్నారు. తమ పిల్లలను కాపాడుకునేందుకే పడుపు వృత్తిలోకి దిగామని చెప్పారు.

రష్మి, మంజరి, ఇంకెందరో..

రష్మి, మంజరి, ఇంకెందరో..

మరో యువతి 21 ఏళ్ల వయస్సులో వేశ్య గృహంలోకి వచ్చానని వివరించారు. సెక్స్ వర్కర్లకు సాయం చేస్తున్నామని ఎస్ఎస్ఎన్ సామాజిక సంస్థ పేర్కొన్నది. తమకు తోచినంత సాయం చేస్తున్నామని.. పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నామని ఇండియా టుడేకు తెలిపారు. వారు గృహల్లో మగ్గిపోతున్నారని.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. తమ వద్ద వనరుల కొరత వల్ల కొందరికీ ప్రయోజనం చేకూర్చగలమని.. మిగతావారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు.

English summary
Thousands of sex workers in Delhi are struggling to survive amid the countrywide lockdown to prevent Covid-19 cases from rising.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X