• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెంగాల్ వార్ : సిఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు మృతి, మా భయం నిజమైందన్న దీదీ , మోడీ కౌంటర్ ఇదే !!

|

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నాలుగవ దశ పోలింగ్ హింసాత్మకంగా మారింది. అనేక ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలలో సిఐఎస్ఎఫ్ దళాలు పోలింగ్ బూత్ వెలుపల కాల్పులు జరపడంతో బెంగాల్ కూచ్ బెహార్లో శనివారం నలుగురు మరణించారు. ఎన్నికల సమయంలో బెంగాల్‌లో కొనసాగుతున్న హింస శనివారం మరింత దారుణ పరిస్థితులకు కారణమైంది . ఇక నలుగురు మృతి ఘటన టీఎంసీ , బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది.

పశ్చిమ బెంగాల్ పోలింగ్ హింసాత్మకం .. కూచ్ బెహార్లో ఘర్షణలు , కాల్పుల్లో నలుగురు మృతిపశ్చిమ బెంగాల్ పోలింగ్ హింసాత్మకం .. కూచ్ బెహార్లో ఘర్షణలు , కాల్పుల్లో నలుగురు మృతి

 హోం మంత్రిత్వ శాఖ కేంద్ర దళాలను ప్రభావితం చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపణ

హోం మంత్రిత్వ శాఖ కేంద్ర దళాలను ప్రభావితం చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపణ

కూచ్ బెహార్లో జరిగిన హింసపై స్పందించిన పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, హోం మంత్రిత్వ శాఖ కేంద్ర దళాలను ప్రభావితం చేస్తోందని ఆరోపించారు అంతేకాదు మొదటి నుంచి మేము ఆందోళన వ్యక్తం చేసినట్లు భయాలు ఈ రోజు నిజమయ్యాయి. కేంద్ర బలగాలు నలుగురి ప్రాణాలు తీశారు అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. కూచ్ బెహార్‌లో సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందటంతో అక్కడ తాజా పరిస్థితి ఉద్రికటంగా మారింది .

దుండగుల దాడిని అడ్డుకుని ప్రతిఘటించే క్రమంలోనే దాడులు అన్న సిఐఎస్ఎఫ్

దుండగుల దాడిని అడ్డుకుని ప్రతిఘటించే క్రమంలోనే దాడులు అన్న సిఐఎస్ఎఫ్

సిఐఎస్ఎఫ్ మరియు ఇతర భద్రతా దళాలు ఒక ముఠాపై దాడి చేశాయని ప్రాథమిక సమాచారం అని సిఐఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. మొదట, వారు ఉదయం 9:40 గంటలకు దాడి చేశారు మరియు మళ్ళీ ఒక గంట తరువాత, పోలింగ్ బూత్ పై దాడి చేశారు. ఇక ఆ దాడిని ప్రతిఘటించే క్రమంలో సిఐఎస్ఎఫ్ కాల్పులు జరిపిందని చెప్తున్నారు . సిసిటివి రికార్డింగ్ మరియు అందుబాటులో ఉన్న ఇతర సాక్ష్యాలను ఎన్నికల సంఘం మరియు పోల్ అధికారితో పంచుకుంటామని వర్గాలు తెలిపాయి .

కూచ్ బెహార్‌లో ఉద్రిక్తత : ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోమన్న దీదీ

కూచ్ బెహార్‌లో ఉద్రిక్తత : ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోమన్న దీదీ

కూచ్ బెహార్‌లోని సిటల్‌కుచి వద్ద శనివారం తెల్లవారుజామున ఘర్షణలు చెలరేగాయి, బాంబులు విసిరి మొదట కొందరు దుండగులు దాడులకు తెగబడ్డారు. ఆ తర్వాత ఓటర్లపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ ను చేయాల్సి వచ్చింది . అయితే తాజా కాల్పుల ఘటనపై ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొన్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఓటర్లు తమ ఓటు ద్వారా కేంద్ర బలగాల దుశ్చర్య పై ప్రతీకారం తీర్చుకోవాలని అన్నారు. అయితే ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు జరపామని సిఐఎస్ఎఫ్ జవాన్లు తెలిపారు.

దీదీ , ఆమె గూండాలు భయపెడుతున్నారన్న మోడీ

దీదీ , ఆమె గూండాలు భయపెడుతున్నారన్న మోడీ

సిలిగురిలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, కూచ్ బెహార్లో జరిగిన దారుణ ఘటనపై బాధగా ఉందన్నారు . మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ. బిజెపికి ప్రజల మద్దతును చూసి దీదీ , ఆమె గూండాలు భయపెడుతున్నారని, ఆమె గెలిచే అవకాశం లేకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవించాయి అని టీఎంసీ నేతలపై మాటల దాడి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

  TN Assembly Elections : Celebrities Voting సోషల్ మీడియాలో వైరల్ | Rajinikanth, Ajith, Vijay
  హింస , దాడులు మిమ్మల్ని కాపాడలేవన్న ప్రధాని మోడీ

  హింస , దాడులు మిమ్మల్ని కాపాడలేవన్న ప్రధాని మోడీ

  ఇదే సమయంలో దీదీ, ఈ హింస, భద్రతా దళాలపై దాడి చేయడానికి ప్రేరేపించే వ్యూహాలు, పోలింగ్ ప్రక్రియను అడ్డుకునే వ్యూహాలు మిమ్మల్ని రక్షించవు. పది సంవత్సరాలుగా పశ్చిమబెంగాల్లో గాడితప్పిన పాలన, ప్రస్తుత హింసతో కొనసాగుతుంది అనుకుంటే పొరపాటేనన్నారు. మొత్తానికి తీవ్ర ఉద్రికతల మధ్య సిఐఎస్ఎఫ్ కాల్పులలో నలుగురు మృతి ఘటనపై మోదీ .. దీదీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

  .
  English summary
  Four people were killed in Bengal's Cooch Behar on Saturday as CISF opened fire outside a polling booth. Reacting to the violence in Cooch Behar, West Bengal CM Mamata Banerjee said, "We have been saying that the home ministry has been influencing the central forces and our worst fears have come true today. They have killed four people." Modi countered Didi and her goons are perturbed, seeing the people's support for BJP. She has stooped to this level as she can see her chair slipping away."
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X