• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐఏఎఫ్ హీరో.. మిగ్-27 పవరేంటో తెలుసా?

|

జీవితంలో ఏది లేకున్నా.. 'మేరే పాస్ మా హై..'' అని గర్వంగా చెప్పుకుంటాడు సినిమా హీరో. రియాలిటీలో భారతవాయుసేన కూడా రొమ్మువిరుచుకుని ఇలాంటి డైలాగే చెబుతుంది.. ''హమారే పాస్ మిగ్27 హై''అని! అదేంటి? ఎఫ్16, రాఫెల్ జమానాలో బోరింగ్ మిగ్ విమానాల ముచ్చటెందుకు? అంటారా.. తప్పదుమరి.. అమ్మ చరిత్రను గుర్తుచేసుకోకపోతే ఎలా?

మిగ్-27.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కి 1985లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మన చిరకాల మిత్రుడు రష్యా(అప్పటి సోవియెట్ యూనియన్) టెక్నాలజీతో రూపుదిద్దుకున్న మిగ్-27.. తర్వాతి కాలంలో ఇండియాలోనే తయారయ్యాయి. హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) వాటిని రూపొందించి ఐఏఎఫ్ కు అందజేసింది.

ఇదీ మిగ్ 27 బలం..

ఇదీ మిగ్ 27 బలం..

ఆకాశంలో వేగంగా ఎగురుతూ.. భూమ్మీదున్న శత్రుశిబిరాల్ని గురితప్పకుండా తునాతునకలు చేస్తుంది.సింగిల్ ఇంజన్ తో పనిచేసే మిగ్27.. బేసిగ్గా టాక్టికల్ ఫైటర్ జెట్. ఇందులో ఒక పైటల్ మాత్రమే కూర్చునేవీలుంటుంది.
గరిష్టవేగం గంటలకు 1700 కిలోమీటర్లు
23 మిల్లీమీటర్ల సిక్స్ బ్యారెల్ రోటరీ ఇంటిగ్రల్ ఫిరంగి దీని సొంతంఒకేసారి 4,000 కిలోల వరకు ఆయుధాలను మోయగలుగుతుంది.డీకమిషన్ సందర్భంగా మిగ్-27లను ప్రాణాంతకమైనవిగా, అత్యంతశక్తిమంతమైన యుద్ధవిమానాలుగా ఐఏఎఫ్ పేర్కొంది.మిగ్27 రంగప్రవేశం చేసినప్పటి నుంచి ఇండియా పాల్గొన్న అన్ని యుద్ధాల్లో భాగం పంచుకుంది. ప్రధానంగా 1999 కార్గిల్ యుద్ధంలో ఈ శ్రేణి ఫైటర్ జెట్ లు ముఖ్యభూమిక పోషించాయి.

పవర్‌కు మారుపేర్లు

పవర్‌కు మారుపేర్లు

యుద్ధరంగంలో శత్రువును గడగడలాడించడంలో నేర్పరైన మిగ్27కు మూడు మారుపేర్లున్నాయి. కార్గిల్ వార్ లో సాహసోపేతంగా పోరాడినందుకు బహదూర్ అని, దీని కాక్ పిట్ లో కూర్చుంటే విశాలమైన బాల్కనీ వ్యూ కనిపిస్తుందికాబట్టి బాల్కన్ అని, విమానం ముందరి భాగం(ముక్కు) ముందుకు పొడుచుకుని ఉన్నందుకు(ఉట్కోనోస్)అని ముద్దుగా పిలుచుకుంటుంది.

చెత్తరికార్డు కూడా దీనిదే

చెత్తరికార్డు కూడా దీనిదే

మిగ్27 యుద్ధవిమానాలకు ఎంత మంచిపేరుందో యాక్సిడెంట్లలో ఎక్కువగా కూలిపోయిన ఫైటర్ జెట్ గానూ అంతే చెత్తరికార్డుంది. ఈ ఏడాది(2019)లోనే.. రొటీన్ ఆపరేషన్ చేస్తుండగా మూడు మిగ్27లు కూలిపోయాయి. 2012లో అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పార్లమెంట్ కు చెప్పిన లెక్కప్రకారం 40 ఏండ్లలో మొత్తం 482 మిగ్ ఎయిర్ క్రాఫ్టులు యాక్సిడెంట్ కు గురయ్యాయి.

English summary
Indian Air Force (IAF ) farewell to 'hero' of Kargil conflict, Mig -27 aircrafts, one of the most prominent fighter jets that has several glorious records to its name
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X