బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంకెప్పుడూ సాఫ్టువేర్ కంపెనీలో పని చేయను!, దురదృష్టవశాత్తూ టెక్కీనయ్యా: బెంగళూరు టెక్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

బెంగుళూరు రోడ్ల పై టెక్కీ గుర్రపు స్వారి

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ట్రాఫిక్ జామ్, ఉద్యోగ ఒత్తిడిలకు నిరసనగా తన ఉద్యోగం చివరి రోజు గుర్రం పైన వెళ్లాడు. ఇది ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంపై ఆయన కూడా ఆశ్చర్యపోయారు.

ఆయన మాట్లాడుతూ.. తాను గత ఎనిమిదేళ్లుగా బెంగళూరులో ఉంటున్నానని, ఇక్కడ తాను ట్రాఫిక్ జామ్, ఎయిర్ పొల్యూషన్ చూస్తున్నానని చెప్పారు. ప్రతి రోజు ట్రాఫిక్ జామ్ చూస్తున్నానని తెలిపారు. అందుకే తాను గుర్రంపై ప్రయాణించానని చెప్పారు.

Fed Up of Bengaluru Traffic, Techie Rides a Horse to Work on Last Day, Becomes Internet Sensation

తాను ఇక ఏ కంపెనీలో పని చేయనని, సొంత వెంచర్ ప్రారంభిస్తానని తెలిపారు. తనలాంటి ఆలోచనలు కలిగిన వారితో సొంత వెంచర్ ప్రారంభిస్తానన్నారు. తాను ఉద్యోగం వదలడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. తాను టెక్నికల్ ఫీల్డును వదలడం లేదని, కానీ ఎంఎన్‌సీ కంపెనీలలో ఉద్యోగం చేయడం మాత్రమే వదిలేశానని తెలిపారు.

ఆటో రిక్ష.. ఇలా ఎక్కడ చూసినా సొంత యూనియన్లు ఉన్నాయని, కానీ సాఫ్టువేర్ ఇంజినీర్లకు మాత్రం లేదన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులను ఏమాత్రం పట్టించుకోవని వాపోయారు. ఒత్తిడిలో పని చేస్తారన్నారు.

Fed Up of Bengaluru Traffic, Techie Rides a Horse to Work on Last Day, Becomes Internet Sensation

గత కొన్నేళ్లుగా తాను స్టార్టప్‌ల గురించి రీసెర్చ్ చేస్తున్నానని చెప్పారు. తనలాంటి ఆలోచనలు కలిగిన వారితో నిత్యం టచ్‌లో ఉన్నానని చెప్పారు. ఉద్యోగంతో విసిగిపోయిన వారితో టచ్‌లో ఉన్నానని చెప్పారు. తనకు ఆర్మీలో పని చేయాలనే కోరిక ఉండేదని, కానీ ఇప్పుడు అది కుదిరే పని కాదన్నారు. దురదృష్టవశాత్తు తాను సాఫ్టువేర్ ఇంజినీర్ అయ్యానని చెప్పారు.

కాగా, సదరు టెక్కీ ఎనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. కానీ జీవితం నరకప్రాయమైంది. అందుకు మొదటి కారణం ట్రాఫిక్ ఇబ్బందులైతే, రెండో కారణం సాప్టువేర్ రంగంలో కొనసాగుతున్న శ్రమదోపిడీ. దీంతో విసుగెత్తి అందుకు నిరసనగా గుర్రం మీద ఆఫీసుకొచ్చాడు. లైఫ్‌లో ఇంకెప్పుడు మల్టీ నేషనల్ కంపెనీలో పని చేయనని చెప్పాడు. కాగా, ఇతనిది రాజస్థాన్.

English summary
A day after he rode a horse to his office, Bengaluru-based software engineer Roopesh Kumar Verma has become an internet sensation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X