• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫెలూదా: కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు కొత్త రకం పరీక్షలు చేయనున్న భారత్

By BBC News తెలుగు
|

కరోనావైరస్

కరోనావైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న భారతదేశం పరీక్షల సంఖ్యను పెంచాలని భావిస్తోంది.

అయితే, కొన్ని రకాల పరీక్షలు ఎంత సమర్థంగా పని చేస్తాయనే అంశంపై పలు అనుమానాలు ఉన్నాయి.

భారతదేశంలో యే రకాల పరీక్షలు అమలులో ఉన్నాయి?

ఈ కొత్త పరీక్ష ప్రెగ్నెన్సీ పరీక్ష లాగే త్వరితగతిన ఫలితాలను ఇస్తుంది. దీనికి భారతీయ కల్పిత డిటెక్టివ్ పాత్ర ఫెలూదా పేరును పెట్టారు.

ఈ పరీక్ష చేయడానికి క్రిస్ప్ ఆర్ (క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేసెడ్ షార్ట్ పాలిన్ డ్రోమిక్ రిపీట్స్) విధానాన్ని వాడతారు. ఇదొక రకమైన జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ.

ఈ విధానం వర్డ్ ప్రాసెసింగ్ లాగే పనిచేసి జెనెటిక్ కోడ్‌లో సూక్ష్మమైన మార్పులు చేసేందుకు డీఎన్ఏ‌ను స్కాన్ చేస్తుంది.

'సికెల్ సెల్ డిసీజ్’ చికిత్సలో దీనిని వినియోగిస్తారు.

ఈ కొత్త పరీక్షలను మరి కొన్ని వారాల్లో చేయడం మొదలు పెడతామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న పరీక్షలలో పీసీఆర్ పరీక్ష ఒకటి. ఇది స్వాబ్ శాంపిల్ నుంచి జెనెటిక్ పదార్ధాన్ని వేరు చేస్తుంది.

ఈ జెనెటిక్ పదార్ధం నుంచి ప్రోటీన్లను, కొవ్వులను వేరు చేయడానికి కొన్ని రకాల రసాయనాలను వాడతారు. ఈ శాంపిల్‌ని మెషీన్ల ద్వారా విశ్లేషిస్తారు.

అయితే, వీటి ఫలితాలను పరిశీలించడానికి 8 గంటలకు పైనే సమయం పట్టడమే కాకుండా ఇవి ఖరీదైనవి కూడా. వీటి ఫలితాలు విడుదల చేయడానికి ఒక రోజు పైనే పడుతుంది. ఇది శాంపిళ్లను ల్యాబ్‌కి తీసుకువెళ్లడానికి పట్టిన సమయంపై కూడా ఆధారపడి ఉంటుంది.

కోవిడ్ ను ఎదుర్కొనేందుకు కొత్త తరహా పరీక్షలు ప్రవేశపెట్టనున్న భారత్

ఈ ఫలితాల కచ్చితత్వంపై అనుమానాలు ఉన్నాయా?

భారతదేశంలో పరీక్షల సామర్థ్యాన్ని పెంచడానికి గాను అధికారులు త్వరగా ఫలితాలను ఇచ్చే రాపిడ్ యాంటీ జెన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇవి చౌక కూడా.

ఈ పరీక్షలు యాంటిజెన్లగా పేర్కొనే ప్రోటీన్లను వేరే చేసి ఫలితాలను 15 - 20 నిమిషాలలో అందిస్తాయి.

అయితే, ఈ పరీక్షల ఫలితాలు అంత కచ్చితంగా ఉంటాయని చెప్పలేము. ఈ పరీక్షలలో 50 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇవి ప్రధానంగా వైరస్ హాట్ స్పాట్ లలో వాడేందుకు పనికి వస్తాయి.

భారత దేశంలో అభివృద్ధి చేసిన రెండు రకాల యాంటిజెన్ పరీక్షలతో పాటు సౌత్ కొరియా, తైవాన్, బెల్జియంలలో తయారైన మొత్తం 5 రకాల యాంటిజెన్ పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతినిచ్చింది.

వీటిలో ఒక పరీక్షను ఐసీఎంఆర్ స్వతంత్రంగా పరిశీలించింది. ఈ పరీక్షలలో వచ్చే ట్రూ నెగటివ్ ఫలితాల కచ్చితత్వం 50 - 84 శాతం మధ్యలో ఉందని నిర్ధరించింది.

ఈ పరీక్షలో నెగటివ్ వచ్చినప్పటికీ, కోవిడ్ లక్షణాలు ఉంటే మాత్రం పీసీఆర్ పరీక్ష కూడా చేయించుకోవాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది.

కోవిడ్ ను ఎదుర్కొనేందుకు కొత్త తరహా పరీక్షలు ప్రవేశపెట్టనున్న భారత్

ర్యాపిడ్ టెస్టులు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందాయా?

బ్రిటన్‌లో చేసిన ర్యాపిడ్ పరీక్షలు 20 శాతం ఫాల్స్ నెగటివ్ ఫలితాలు ఇస్తున్నాయి.

కానీ, ఆక్స్ఫర్డ్ నానోపోర్ తయారు చేసిన ర్యాపిడ్ పరీక్షలు మాత్రం 98 శాతం పాజిటివ్ కేసులను కనుగొంటున్నాయని చెబుతున్నారు. అయితే, దీనిని వైద్య నిపుణులు స్వతంత్రంగా పరిశీలించి నిర్ధరించాల్సి ఉంది.

ఈ రెండు రకాల ర్యాపిడ్ పరీక్షలలోనూ జెనెటిక్ పదార్ధాలను వాడతారు. ఇందులో యాంటీజెన్లను వాడరు.

రాపిడ్ యాంటిజెన్ పరీక్షలో ఫలితం నెగటివ్ అని వచ్చినప్పటికీ పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ సూచిస్తున్నాయి.

దిల్లీలో టెస్టులు

భారతదేశంలో రాష్ట్రాలు కరోనావైరస్ కేసులను సరిగ్గా నమోదు చేయలేకపోతున్నాయా?

యాంటిజెన్ పరీక్షలను చేయడం ముందుగా దిల్లీ జూన్ లో మొదలు పెట్టింది. ఆ తరువాత చాలా రాష్ట్రాలు ఈ పరీక్షను చేయడం మొదలుపెట్టాయి.

ఈ పరీక్షలను జూన్ 18 నుంచి చేయడం మొదలు పెట్టినప్పటికీ జూన్ 29 వరకు దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.

జూన్ 29 నుంచి జులై 28 వరకు దిల్లీలో చేసిన పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే అందులో 63 శాతం యాంటిజెన్ పరీక్షలే ఉన్నాయి.

సెప్టెంబరు 08 నుంచి 15 వరకు చూస్తే అందులో పావు వంతు పరీక్షలు మాత్రమే పిసిఆర్ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే, అక్టోబరు నుంచి పిసిఆర్ పరీక్షల సంఖ్యను పెంచడంతో దిల్లీలో పరీక్షలు నిర్వహించే వ్యూహం మారింది.

యాంటిజెన్ పరీక్షలో నెగటివ్ ఫలితాలు వచ్చిన వారిలో 85 శాతం లక్షణాలు కనిపిస్తున్న వారికి తిరిగి పిసిఆర్ పరీక్షలు నిర్వహించారు. అంతకు ముందు కేవలం 10 -- 15 శాతం మందికే తిరిగి పరీక్షలు చేశారు.

దీని వలన అక్టోబరు 21 నుంచి పాజిటివ్ ఫలితాలు 8 శాతం పెరిగాయి. అంతకు ముందు వారం పాజిటివ్ సంఖ్య 6.2 శాతం ఉండేది.

అయితే, పరీక్షల సంఖ్యను పెంచడం వలన కూడా పాజిటివ్ కేసులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

కర్ణాటక లోని 30 జిల్లాలలో 35,000 పరీక్షలు చేసే లక్ష్యంతో జులై నుంచే యాంటిజెన్ పరీక్షలను చేయడం మొదలుపెట్టింది.

కర్ణాటక టెస్టులు

ఆగస్టు ప్రారంభంలో కర్ణాటక యాంటిజెన్ పరీక్షల సంఖ్యను పెంచి పిసిఆర్ పరీక్షలను తగ్గించింది. కానీ, యాంటిజెన్ పరీక్షల ఫలితాల కచ్చితత్వంపై అనుమానాలు తలెత్తడంతో తిరిగి పీసీఆర్ పరీక్షలు చేయటం ప్రారంభించింది.

ఆగస్టు చివరి నాటికి నెగటివ్ ఫలితాలు వచ్చిన 17 శాతం మందికి పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ నిర్ధరణైంది.

తెలంగాణలో జులై నుంచి యాంటిజెన్ పరీక్షలు చేయడం పెంచారు.

ప్రస్తుతం ఈ పీసీఆర్ పరీక్షలను చేయడానికి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ల్యాబులు కలిపి మొత్తం 61 ఉన్నాయి. కానీ, యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడం కోసం 1000కి పైగా ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయి.

కోవిడ్ బారిన తీవ్రంగా పడిన మహారాష్ట్రలో కూడా జులై నుంచి యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆ సమయంలో లక్షణాలు కనిపించిన వారిలో యాంటిజెన్ పరీక్షలో 65 శాతం మందికి నెగటివ్ వచ్చినట్లు నగర మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. కానీ, పిసిఆర్ పరీక్ష నిర్వహించినప్పుడు అందులో చాలా మందికి పాజిటివ్ అని తేలినట్లు తెలిపింది.

అయితే, ఈ ర్యాపిడ్ పరీక్షల వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయని పబ్లిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ అనుపమ్ సింగ్ చెబుతారు.

"ఇది వైరస్ ని తొందరగా కనిపెట్టడానికి సహాయపడటం మాత్రమే కాకుండా పాజిటివ్ ఉన్న వ్యక్తులను తొందరగా గుర్తించేలా చేస్తుంది" అని ఆయన అన్నారు.

అయితే, వీటి మీదే ఆధారపడటం వలన చాలా ఇన్ఫెక్షన్లు గుర్తించకుండా కూడా పోవచ్చని అభిప్రాయపడ్డారు.

రియాలిటీ చెక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
India to test new type of coronavirus called Feluda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X