వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: జ్వరం కరోనా లక్షణం కాదు, మగాళ్ల దెబ్బ, సెక్స్, సిగరెట్, వయసు, AIMMS నివేదిక !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) ఎలా వ్యాపిస్తుందో ఇప్పటికు కచ్చితంగా అంతు చిక్కడం లేదు. జ్వరం వచ్చిన వారికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు కచ్చితంగా చెప్పలేమని, జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ సోకిందని భావించడం పొరపాటు అవుతోందని All India Institute of Medical Sciences (AIIMS) అధ్యయనంలో వెలుగు చూసింది. కరోనా వైరస్ లక్షణాలు ఎలా వ్యాపిస్తాయో ఎయిమ్స్ వివరించింది. మగాళ్ల బహిరంగ చర్చలు, ప్రయాణాలతో కరోనా వస్తోందని వివరించింది. వయసు, సెక్స్, సిగరేట్ కారణంగా కరోనా వస్తుందని విషయంలో ఎయిమ్స్ క్లారిటీ ఇచ్చింది. జ్వరం ఉన్న ప్రతిఒక్కరికి కరోనా వైరస్ వచ్చిందని ఇంతకాలం పొరపాటు పడటం వలన వైరస్ విషయంలో మనం దెబ్బ తిన్నామని వెలుగు చూసింది.

Mafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తోMafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తో

 నిపుణుల అధ్యయనం !

నిపుణుల అధ్యయనం !

ఉత్దరభారదేశంలో కోవిడ్ 19 రోగులు ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలో బయటపడ్డారు. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 144 మంది రోగుల క్లినికో- డెమాగ్రాఫిక్ ప్రొఫైల్, ఆసుపత్రి ఫలితాల డేటాను 29 మంది ప్రముఖ వైద్యులు పరిశీలించి అధ్యయనం చేశారు. రోగులను అధ్యయనం చేసిన వారిలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కూడా ఉన్నారు. కరోనా రోగుల్లో 93 శాతం మంది (134 మంది పురుషులు), మిగిలిన పది మంది విదేశీయులు ఉన్నారు.

 దేశంలోనే టాప్ ఆసుపత్రులు

దేశంలోనే టాప్ ఆసుపత్రులు

144 మందిని అధ్యయనం చేసిన నిపుణలు ఆసక్తికరమైన విషయాలు వెళ్లడించారని ఎయిమ్స్ తెలిపింది. 144 మంది దేశంలోని వివిద ప్రముఖ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందారని ఎయిమ్స్ తెలిపింది. అయితే కరోనా వైరస్ సోకడానికి జ్వరం కారణం అవుతోందని నొక్కి చెప్పడానికి వీలుకాదని, జ్వరం వలన కరోనా వైరస్ వస్తుందని అపోహమాత్రమే అని ఎయిమ్స్ వెళ్లడించింది.

 జ్వరం వచ్చిన వారిలో ఎంత మందికి కరోనా !

జ్వరం వచ్చిన వారిలో ఎంత మందికి కరోనా !

ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం జ్వరంతో ఆసుపత్రిలో చేరిన వారిలో కేవం 17 శాతం మందికి మాత్రమే కరోనా వైరస్ వచ్చిందని వెలుగు చూసింది. ప్రపంచంలోని ఇతర నివేదికలతో పోల్చితే భారతదేశంలో జ్వరంతో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇది చైనా నివేదికలతో కూడా పోల్చారు. జ్వరం వచ్చి కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రిలో చేరిన వారిలో 88 శాతం మంది వ్యాధి నయం చేసుకుని బయటపడ్డారని ఎయిమ్స్ వివరించింది. ఎక్కువ మంది కరోనా రోగులు నాసికా లక్షణాలు, దగ్గు, శ్వాసకోస ఇబ్బందులతో బాధపడిన వారే అని ఎయిమ్స్ వివరించింది.

 మగాళ్లతో ఎక్కువగా కరోనా వస్తోంది

మగాళ్లతో ఎక్కువగా కరోనా వస్తోంది

ఎక్కువ మంది ప్రయాణాలు చెయ్యడం, కరోనా వైరస్ సోకిన వారితో దగ్గరగా ఉండటం వలనే ఆ వైరస్ ఇతరులకు వ్యాపించిందని ఎయిమ్స్ అధ్యయనంలో వెలుగు చూసింది. ముఖ్యంగా మగవాళ్లు ఎక్కువ మంది బహిరంగ ప్రదేశాల్లో గుమికూడి చర్చలు కొనసాగించడం వలన ఎక్కువగా కరోనా వైరస్ ఇతరులకు వ్యాపించిందని ఎయిమ్స్ అధ్యయనంలో వెలుగు చూసింది. కరోనా రోగులతో సన్నిహితంగా మెలగడం, వారికి చికిత్స చేసే సమయంలో దగ్గరగా మెలగడం వలనే వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్ వ్యాధి వ్యాపించదని ఎయిమ్స్ అధ్యయనంలో వెలుగు చూసింది.

 సిగరెట్, సెక్స్, వయసుతో సంబంధం లేదు

సిగరెట్, సెక్స్, వయసుతో సంబంధం లేదు

ఎయిమ్స్ నిపుణులు పరిశోధనలో 2.8 శాతం మందికి మాత్రమే తీవ్రమైన కోవిడ్ -19 లక్షణాలు ఉన్నాయి. 97.8 శాతం మంది తేలికపాటి అంటువ్యాధుల లక్షణాలు ఉన్నాయని వెలుగు చూసింది. ఇదే సమయంలో 11.1 శాతం మంది మాత్రమే జ్వరంతో కరోనా వైరస్ వ్యాధి సోకి బాధపడ్డారని ఎయిమ్స్ తెలిపింది. వయసు, సిగరెట్ (ఊపిరితిత్తుల సమస్యలు), వయసుకు, కరోనా వైరస్ కు ఎలాంటి సంబంధం లేదని నిపుణుల నివేదికలో వెలుగు చూసింది.

 ఇలా కరోనా వ్యాధి కట్టడి చేస్తున్నారు

ఇలా కరోనా వ్యాధి కట్టడి చేస్తున్నారు

కరోనా వ్యాధి నయం చేసుకున్న వారికి ఆ రోగ లక్షణాలను అంతం చెయ్యడానికి సీ విటమిన్ ఉన్న ఔషదాలు, యాంటి హిస్టామైన్లు, పారాసెటమాల్ (Paracetamol) మాత్రలు ఎక్కువగా ఉపయోగించారని ఎయిమ్స్ అధ్యయనంలో వెలుగు చూసింది. 29 మందికి యాంటిబయాటిక్ అజిథ్రోమైసిన్, మలేరియాను అరికట్టే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషదాలు 27 మందికి, 11 మందికి అజిత్రోమైసిన్, HCQ కలిపిన ఔషదాలు ఇచ్చారని, వారు కరోనా వ్యాధిని నయం చేసుకుని బయటపడ్డారని ఎయిమ్స్ నివేదిక తెలిపింది.

English summary
Coronavirus: Several Covid-19 cases could be missed due to the over-emphasis on fever as a predominant symptom, according to a study published by the Indian Journal of Medical Research.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X