వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలాంటి ధైర్యం అందరికీ ఉండదు.. రాహుల్ నిర్ణయాన్ని సమర్థించిన ప్రియాంక..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ పంతం నెగ్గించుకున్నారు. పార్టీ పెద్దలు వారించినా, వర్కింగ్ కమిటీ వద్దన్నా పదవి నుంచి వైదొలిగారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యతవహిస్తూ రాజీనామా చేయడంపై రాహుల్ సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొందరు మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకోగలరని, రాహుల్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు.

"నీలాగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం కొందరికి మాత్రమే ఉంటుంది. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా." అని రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ ప్రియాంక ట్విటర్‌లో ట్వీట్ చేశారు.

Few Have Courage Priyanka reacts On Rahuls Resignation

2017 డిసెంబర్ 16న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ ఆ పదవికి రాజీనామా చేసినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాలుగు పేజీల లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కఠిన నిర్ణయాలు అవసరమన్న ఆయన.. పార్టీని పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తన స్థానంలో కొత్త ప్రెసిడెంట్‌ను ఎంపిక చేసే బాధ్యతను ఒక బృందానికి అప్పగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సూచించారు.

English summary
A day after Rahul Gandhi announced his resignation as Congress president in a public letter owning responsibility for the party's national election defeat, his sister Priyanka Gandhi Vadra tweeted: "Few have the courage that you do".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X