వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికొన్ని గంటల్లో నీట్ : విద్యార్థులు ఈ జాగ్రత్తలు తీసుకొండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : డాక్టర్ అవ్వాలనే విద్యార్థుల నేషనల్ ఎలిజిబులిటి ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) అర్హత పరీక్ష రాసి తమ కలను సాకారం చేసుకుంటారు. బైపీసీ విభాగంలో ఇంటర్ చేసిన విద్యార్థులు నీట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీటు కన్ఫామ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసింది.

ఇవీ సూచనలు ..

ఇవీ సూచనలు ..

ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతోంది. పరీక్షకు అవసరమైన హాల్ టికెట్ ను పరీక్ష జరిగే రోజు వరకు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతోపాటు నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు కొన్ని సూచనలు చేసింది. అవేంటో చుద్దాం.

1.30 దాటితే అనుమతించరు

1.30 దాటితే అనుమతించరు

నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ మధ్యాహ్నం 2 గంటలకు .. పరీక్ష సమయం కంటే గంటర్నర ముందే హాలులోకి చేరుకోవాలి. పరీక్ష జరిగే అరగంట ముందు అంటే 1.30 దాటితో హాలులోనికి విద్యార్థులను అనుమతించారు. పరీక్ష హాలులోకి వెళ్లేముందు హాల్ టికెట్, ఐడీ ప్రూఫ్ విధిగా తీసుకెళ్లాలి. ఓటర్ ఐడీ, పాన్, ఆధార్ కార్టు వెంట తీసుకోని రావాలని బోర్డు పేర్కొంది

పూలు పెట్టుకోవద్దు, రింగులు ధరించొద్దు

పూలు పెట్టుకోవద్దు, రింగులు ధరించొద్దు

పరీక్ష హాలులోనికి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. అంతేకాదు తలలో పువ్వులు, చెవులకు రింగులు, మెడకు, కాళ్లకు ఆభరణాలు కూడా ధరించొద్దని బోర్డు స్పష్టంచేసింది. పొరపాటున ధరిస్తే అక్కడ భద్రపరచానికి ఏర్పాట్లు లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తున్నందున .. ముందే అభ్యర్థులు జాగ్రత్త పడటం మచింది.

సన్ గ్లాసెస్ కూడా ..

సన్ గ్లాసెస్ కూడా ..

కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకోవద్దని సూచించింది. బ్యాగులు, పర్సులను కూడా అనుమతించమని బోర్డు తేల్చిచెప్పినందున .. విద్యార్థులు పెన్ను, హాల్ టికెట్, ఐడీ ప్రూఫ్ తీసుకోని మాత్రమే వెళ్లండి. మరికొన్నిగంటల్లో పరీక్ష రాసే విద్యార్థులకు వన్ ఇండియా ఆల్ ద బెస్ట్ చెబుతోంది.

English summary
Students who have interpreted in the Bpc division are going to confine the seat based on the marks you have achieved. The nationwide Sunday Neet exam is conducted. The CBSE has made arrangements for this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X