వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి ఫీల్డ్ మార్షల్ కరియప్పకు భారతరత్న ఇవ్వాలి: ఆర్మీ జనరల్ రావత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పకు భారతరత్న ఇవ్వాలని ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ప్రతిపాదించారు. భారతీయ సైన్యానికి మొదటి కమాండర్ ఇన్ చీఫ్‌గా కరియప్ప సేవలందించారు.

1947లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఆయన భారత సైన్యానికి చీఫ్‌గా వ్యవహరించారు. బ్రిటీష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ సర్ రాయ్ బుచర్ నుంచి బాధ్యతలు స్వీకరించిన మొదటి ఇండియన్ కమాండర్ కరియప్ప కావడం విశేషం.

Field Marshal KM Cariappa deserves Bharat Ratna: General Rawat

కర్నాటక రాష్ట్రానికి చెందిన కరియప్పను ముద్దుగా కిప్పర్ అని కూడా పిలుస్తారు. 1919లో కరియప్ప బ్రిటీష్ ఆర్మీలో చేరారు. ఇరాక్, సిరియా, ఇరాన్, బర్మా దేశాల్లోనూ ఆయన విధులు నిర్వర్తించారు.

అయితే కరియప్పకు భారత రత్న ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రస్తుత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, 1947లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో కరియప్ప విశేషమైన సేవలందించి భారత్‌కు విజయాన్నందించారు.

English summary
Army Chief General Bipin Rawat on Saturday said it's time to recommend Field Marshal KM Cariappa for the Bharat Ratna, the highest civilian award of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X