వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంటే కూతుర్నే కనాలి .. తండ్రిని సైకిల్ ఎక్కించుకుని 1200కి.మీ తొక్కిన బాలిక సాహసానికి సలాం అనాలి

|
Google Oneindia TeluguNews

సమాజంలో ఆడపిల్ల అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నా ఇంకా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మగవాళ్ళ కంటే శారీరకంగా బలహీనులు అన్న భావన ఉంది . కానీ శారీరకంగానే కాదు మానసికంగా మగవాళ్ళకు , స్త్రీలు ఏమాత్రం తీసిపోరు అని నిరూపించింది ఒక బాలిక .

Recommended Video

Cycling Federation Offered Trial To Girl Who Cycled 1200 km Carrying Father

వలస కార్మిక కష్టాలకు సింబాలిక్ గా .. మనసును పిండేస్తున్న రాంపుకార్ పండిట్ ఫోటో వెనుక అసలు కథ ఇదే వలస కార్మిక కష్టాలకు సింబాలిక్ గా .. మనసును పిండేస్తున్న రాంపుకార్ పండిట్ ఫోటో వెనుక అసలు కథ ఇదే

శారీరక బలంకన్నా సంకల్ప బలం గొప్పది అని ప్రూవ్ చేసింది 15ఏళ్ళ బాలిక

శారీరక బలంకన్నా సంకల్ప బలం గొప్పది అని ప్రూవ్ చేసింది 15ఏళ్ళ బాలిక

శారీరక బలంకన్నా సంకల్ప బలం గొప్పది అని ప్రూవ్ చేసింది ఒక అమ్మాయి. కరోనా లాక్ డౌన్ ఉపాధి లేకుండా చేస్తే సొంత ఊరికి పయనమైన ఓ తండ్రీ కూతుళ్ళు పడరాని పాట్లు పడ్డారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని 1200కిలోమీటర్లు ప్రయాణం చేసింది ఒక 15ఏళ్ళ బాలిక. ఇది విన్నవాళ్ళు ఆశ్చర్యానికి గురవ్వగా కొందరు ఆ బాలిక సాహసానికి సలాం చేశారు . ఆడపిల్ల గొప్పతనం గుర్తించారు.

తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు సాహసోపేత ప్రయాణం

తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు సాహసోపేత ప్రయాణం

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికుల కష్టాలు ఇంతింత అని చెప్పనలవి కాకుండా ఉన్నాయి . తమ సొంతూర్లకు వెళ్లేందుకు కొందరు కాలినడకన నెలల తరబడి నడుస్తూనే ఉన్నారు. మండుటెండలో ఆకలి, దప్పులను తట్టుకుంటూ నరకం చూస్తున్నారు. వేల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తున్నారు. ఇక ఇదే సమయంలో కరోనా లాక్ డౌన్ దెబ్బతో ఉపాధి కోల్పోయిన ఒక తండ్రి తన కూతురితో కలిసి స్వస్థలానికి బయలుదేరాడు .మార్గమధ్యలో గాయపడ్డాడు. అయినా అలాంటి తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు సాహసోపేతమైన ప్రయాణం సాగించింది ఒక 15ఏళ్ళ బాలిక .

లాక్ డౌన్ కారణంగా ఉపాధి పోగొట్టుకున్న ఒక వలస కార్మికుడు

లాక్ డౌన్ కారణంగా ఉపాధి పోగొట్టుకున్న ఒక వలస కార్మికుడు

ఇక అసలు విషయానికి వస్తే బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి తన పదిహేను ఏళ్ల కుమార్తెతో కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు. అక్కడ రిక్షా తొక్కుతూ దాంతో వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్న అతనికి కరోనా దెబ్బ కొట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా కిరాయికి తీసుకొచ్చిన రిక్షాను యజమాని వెనక్కి తీసుకున్నాడు. ఇక ఉపాధి లేక చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో వీరు ఉంటున్న గది అద్దెను చెల్లించాలని యజమాని డిమాండ్‌ చేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారు సొంతూరికి పయనమయ్యారు.

 ఢిల్లీ నుండి బీహార్ లోని దర్భాంగకు సైకిల్ పై వెళ్ళిన తండ్రీకూతుళ్లు

ఢిల్లీ నుండి బీహార్ లోని దర్భాంగకు సైకిల్ పై వెళ్ళిన తండ్రీకూతుళ్లు

అయితే ఓ ట్రక్కు డ్రైవర్‌ను తమను గమ్య స్థానానికి చేర్చాలని కోరారు . అయితే అతను రూ. 6 వేలు డిమాండ్‌ చేశాడు. అంత డబ్బు లేక , ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో రూ. 500లకు ఓ సైకిల్‌ను కొన్నారు.ఇక మే 10వ తేదీన ఢిల్లీ నుంచి దర్భాంగకు సైకిల్‌పై బయల్దేరారు. గాయపడిన తండ్రిని సైకిల్ పై ఎక్కించుకుని సుమారు వారం రోజుల పాటు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కింది ఆ అమ్మాయి జ్యోతి కుమారి .

 వారం రోజులపాటు 1200 కి.మీ మేర సాగిన ప్రయాణం

వారం రోజులపాటు 1200 కి.మీ మేర సాగిన ప్రయాణం


వారం రోజులపాటు అలుపెరగకుండా సాగించిన ప్రయాణంతో సొంతూరికి చేరుకుంది . అయితే మార్గమధ్యలో కేవలం రాత్రి సమయాల్లో 2 నుంచి 3 గంటలు మాత్రమే పెట్రోల్‌ బంకుల్లో విశ్రాంతి తీసుకునేవారు. మళ్ళీ ఇల్లు చేరాలనే సంకల్పం ఆమెను సైకిల్ తొక్కించింది. మే 16న సొంతూరికి రాగానే తండ్రీకూతుళ్లను క్వారంటైన్‌కు తరలించారు. ఇక వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది.

English summary
Fifteen-year-old Jyoti did not just walk for miles but decided to carry her injured father from Delhi to Darbhanga, Bihar – almost 1,200 kilometres – on a bicycle. A desperate daughter cycled with her ailing father all the way from the capital to reach their village,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X