వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారా?.. మంత్రిగారి మాటల మర్మమేంటో..!

|
Google Oneindia TeluguNews

ముంబై : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు ఓవైపు పేలుతుంటే.. ఆపరేషన్ ఆకర్ష్ మరోవైపు అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. అదలావుంటే ఈసారి అధికార పీఠం దక్కించుకోవాలని శివసేన ఉవ్విళ్లూరుతోంది. అయితే ఎన్నికల వేళ మరింత హీట్ పుట్టించేలా యవ్వారం నడుపుతోంది బీజేపీ.

అక్బరుద్దీన్ కామెంట్స్‌.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు.. ఛార్జ్ షీట్ ఎప్పుడో మరి?అక్బరుద్దీన్ కామెంట్స్‌.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు.. ఛార్జ్ షీట్ ఎప్పుడో మరి?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో బీజేపీ యమ దూకుడుగా కనిపిస్తోంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్ చేస్తున్నారు కమలనాథులు. ఇదివరకే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సందీప్ నాయక్‌తో పాటు వైభవ్ పిచడ్‌.. అలాగే కాంగ్రెస్ శాసనసభ్యుడు కాళిదాస్ కొలంబర్‌కు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ మేరకు స్పీకర్ హరిబాహు బాగడేకు రాజీనామా లేఖలు కూడా అందించారు.

fifty mlas want to join in bjp minister girish mahajan comments

ఆ క్రమంలో జలవనరుల శాఖ మంత్రి గిరీశ్ మహాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్‌కు తెర తీశారు. బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల నుంచి దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు కమలతీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే చాలామంది బీజేపీ వైపు చూస్తున్నా.. అందరికి అవకాశం ఉండబోదని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేర్చుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయని.. ఎవరిని పడితే వారికి కాషాయం కండువా కప్పలేమని వ్యాఖ్యానించడం కొసమెరుపు.

English summary
Maharashtra Water Resources Minister Girish Mahajan made sensational comments. He said that, Many people are excited to join BJP. There are more than 50 MLAs of Congress and Nationalist Congress Party (NCP) who want to join BJP. But we also, have some limitations, we cannot admit everyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X