వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరాబాబా: విలాస జీవితం, రాజకీయ అండ, నటనపై ఆసక్తి

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీఘడ్: డేరా బాబా విలాసవంతమైన జీవితం గడుపుతాడు. లక్షలాది మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. ఆయన వెంట భద్రతా వలయం ఉంటుంది. సిబిఐ కోర్టు అత్యాచారం కేసులో ఆయనకు శిక్ష విధించడంతో ఆయన అభిమానులు ఉత్తరాది రాష్ట్రాల్లో విధ్వంసానికి దిగుతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సైన్యం రంగంలోకి దిగింది.

ఢిల్లీకి పాకిన అల్లర్లు,15 మంది మృతి, బాబా ఆస్తులు అటాచ్‌ఢిల్లీకి పాకిన అల్లర్లు,15 మంది మృతి, బాబా ఆస్తులు అటాచ్‌

డేరా బాబా ... అడుగేస్తే ఓ సంచలనం.. విఐపీ తరహలో డేరా బాబా జీవితం కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఆయనకు విపరీతమైన అభిమానులున్నారు. అయితే డేరా బాబా తనకు అడ్డువచ్చిన వారిని అంతం చేస్తారనే ఆరోపణలు కూడ ఉన్నాయి

డేరాబాబా:నల్గొండ జిల్లాతో అనుబంధం, 56 ఎకరాల్లో ఆశ్రమండేరాబాబా:నల్గొండ జిల్లాతో అనుబంధం, 56 ఎకరాల్లో ఆశ్రమం

గతంలో చోటుచేసుకొన్న మరణాలపై డేరా బాబాపై ఆరోపణలు వచ్చాయి. డేరా బాబా ఆశ్రమంలో ఇద్దరు సాద్వాలపై అత్యాచారం చేశారని అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత సిబిఐ కోర్టు డేరాబాబాకు శుక్రవారం నాడు శిక్ష విధించింది.

డేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులుడేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులు

ఈ శిక్షను నిరసిస్తూ డేరాబాబా అనుచరులు తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు.అయితే ఈ విధ్వంసంపై కోర్టు కూడ సీరియస్ అయింది. బాబా ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది.

విలాసవంతమైన జీవితం గడిపే బాబా

విలాసవంతమైన జీవితం గడిపే బాబా

లెదర్‌ దుస్తులు, డైమండ్లను ఎక్కువగా ప్రేమించేవాడు గుర్మీత్‌. లెదర్‌, డైమండ్లతో రూపొందించిన దుస్తుల్లో తరచూ కనిపించేవాడు. నటనపై ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. నాలుగైదు సినిమాల్లో ఆయన నటించారు. గుర్మీత్‌ అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. పంజాబ్‌, హరియాణా పట్ణణాలు, గ్రామాల్లో ఆయనకు భారీ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు.

రాజకీయ మద్దతు

రాజకీయ మద్దతు

రాజకీయంగానూ ఆయనకెంతో మద్దతు ఉంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హర్యాణాలో ఆయన భాజపాకు మద్దతు ప్రకటించారు. డేరా సచ్చా సౌధా నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ప్రముఖ నేతలతో పాటూ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ కూడా పాల్గొన్నారు. ఇక పంజాబ్‌లో అప్పట్లో భాజపా-అకాళీదళ్‌ ప్రభుత్వానికి ఆయన మద్దతు ప్రకటించారు.ఈ కారణంగా కూడ డేరా బాబాపై చర్యలు తీసుకొనే విషయాల్లో ప్రభుత్వాలు వెనుక ముందు ఆలోచిస్తాయనే విమర్శలు కూడ లేకపోలేదు.

డేరా బాబాపై దాడి

డేరా బాబాపై దాడి

2008లో గుర్మీత్‌ లక్ష్యంగా దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ సమకూర్చింది ప్రభుత్వం.ఆ ఘటనలో 11 మంది గాయపడగా, ఒక కారు దగ్ధమైంది.సంక్షేమ, ఆధ్యాత్మిక సంస్థగా పేర్కొనే డేరా సచ్చా సౌధాను 1948లో స్థాపించారు. 1990లో దీని బాధ్యతలను గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ చేపట్టారు. డేరా బాబాపై 19 గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి.రక్తదానం, కంటి పరీక్షలు లాంటి సేవలకు సంబంధించి ఈ రికార్డులు నమోదయ్యాయి.

అంతర్జాతీయంగా లవ్ చార్జర్ మ్యూజిక్ వీడియో

అంతర్జాతీయంగా లవ్ చార్జర్ మ్యూజిక్ వీడియో

గుర్మీత్‌ నటించిన ‘లవ్‌ ఛార్జర్‌' అనే మ్యూజిక్‌ వీడియో అంతర్జాతీయంగా ప్రదర్శితమైంది. గత ఏడాది అమెరికాలోని టునైట్‌ షోలో దీన్ని ప్రదర్శించారు. ఈ వీడియో మెగా హిట్‌ అయిందని.. 20 లక్షల కాపీలు అమ్ముడుపోయాయని డేరా సచ్చా సౌధా పేర్కొంది. గుర్మీత్‌ రెండు బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించారు. రాక్‌స్టార్‌గా డేరా బాబాకు పేరుంది.

English summary
Seen as an convict under law, treated as a God by his millions of followers, courted by politicians and political parties, protected by the police with Z-plus security cover and targeted by Sikh radicals, Dera Sacha Sauda sect chief Gurmeet Ram Rahim Singh, is as controversial as he is colourful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X