• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒక భార్య కోసం ఇద్దరు భర్తల గొడవ, నా భార్యను వదిలేయ్, నాతో పంపిస్తావా ? చస్తావా ? అయితే చచ్చిపో !

|

బెంగళూరు: ఒక భార్య కోసం ఇద్దరు భర్తలు గొడవ పడటంతో ఒకరు హత్యకు గురైనారు. నా భార్యను నాకు వదిలేయ్ అంటే లేదు లేదు నేను చస్తే వదిలి పెట్టను అంటూ ఒకరు మొండికి వెయ్యడంతో ఇద్దరి మద్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో నా భార్యను తనకు కాకుండా చేస్తావా ? నువ్వు చచ్చిపో అంటూ ఓ యువకుడు రెచ్చిపోయి కత్తితో మరో వ్యక్తిని దారుణంగా పొడిచి హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది.

ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !

జల్సాగా దంపతులు

జల్సాగా దంపతులు

బెంగళూరు నగరంలోని శ్రీనివాసనగర్ లో నివాాసం ఉంటున్న ఇర్ఫాన్ (30) అనే యువకుడు ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత ఇర్ఫాన్ అతని భార్యతో జల్సాగా ఉన్నాడు. అయితే దంపతుల మధ్య అభిప్రాయవిభేదాలు రావడంతో ఇర్ఫాన్ భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. చివరికి ఇర్ఫాన్ అతని భార్యను దూరం పెట్టాడు.

 నిన్నేప్రేమించా, నిన్నే పెళ్లి చేసుకుంటా !

నిన్నేప్రేమించా, నిన్నే పెళ్లి చేసుకుంటా !

భర్త ఇర్ఫాన్ వదిలి వెయ్యడంతో ఆ యువతి కొంత కాలం ఒంటరిగా జీవించింది. తరువాత ఆటో డ్రైవర్ తౌశిఫ్ తో యువతికి పరిచయం అయ్యింది. తౌశిఫ్ తనకు పరిచయం అయిన యువతిని ప్రేమించాడు. తనకు ఇంతకు ముందే వివాహం అయ్యిందని భర్త వదిలేశాడని ఆ యువతి తౌశిఫ్ కు చెప్పింది. అయితే కానీలే నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని తౌశిఫ్ ఆ యువతికి చెప్పాడు.

 రెండో భర్తతో కాపురం

రెండో భర్తతో కాపురం

తౌశిఫ్ ను వివాహం చేసుకున్న తరువాత ఆ యువతి డీజే హళ్ళిలో కాపురం పెట్టింది. మొదటి భర్త ఇర్ఫాన్ కు పూర్తిగా దూరం అయిన యువతి తౌశిఫ్ తో కలిసి నివాసం ఉంటోంది. నీ భార్య ఆటో డ్రైవర్ తౌశిఫ్ ను రెండో పెళ్లి చేసుకుందని, ఇక ముందు నీ దగ్గరకు వచ్చే చాన్స్ లేదని కొందరు తెలిసిన వాళ్లు ఇర్ఫాన్ కు చెప్పారు.

 రగిలిపోయిన మొదటి భర్త

రగిలిపోయిన మొదటి భర్త

తెలిసిన వాళ్లు పదేపదే నీ భార్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పడంతో ఇర్ఫాన్ రగిలిపోయాడు ఎలాగైనా తన భార్యను తనతో తీసుకు వచ్చి కాపురం పెట్టాలని ఇర్ఫాన్ నిర్ణయించాడు. ఇదే విషయం భార్యకు చెప్పాడు. అయితే ఆమె మాత్రం నీతో రానని ఇర్ఫాన్ కు తేల్చి చెప్పింది. భార్య తనతో రావడానికి ఎదురు తిరగడంతో ఇర్ఫాన్ మరింత రగిలిపోయాడు.

 నా భార్యను ఇస్తావా, చస్తావా !

నా భార్యను ఇస్తావా, చస్తావా !

నెల రోజుల నుంచి తన భార్యను తనతో పంపించాలని మొదటి భర్త ఇర్ఫాన్ ఆటో డ్రైవర్ తౌశిఫ్ కు చెబుతున్నాడు. తాను రెండో పెళ్లి చేసుకున్నానని, అందువలన తాను ఆమెను పంపించనని తౌశిఫ్ కచ్చితంగా చెప్పాడు. అప్పటి నుంచి ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. నా భార్యను అప్పగించకపోతే చంపేస్తానని ఇర్ఫాన్ ఆటో డ్రైవర్ తౌశిఫ్ ను బెదిరించాడు.

నా భార్య నీకు కావాలా ? చచ్చిపో !

నా భార్య నీకు కావాలా ? చచ్చిపో !

గత రాత్రి 11.30 గంటల సమయంలో కావల్ భైరసంద్రలోని ఆల్ అమీన్ ఉర్దూ స్కూల్ సమీపంలో ఆటో డ్రైవర్ తౌశిఫ్ నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఇర్ఫాన్ తన భార్యను తనకు అప్పగించాలని చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన తౌశిఫ్ కత్తి తీసుకుని ఇర్ఫాన్ చాతిలో పొడిచాడు. తీవ్రగాయాలైన ఇర్ఫాన్ ను అంబేద్కర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా అతను మరణించాడు. ఇర్ఫాన్ ను హత్య చేసి పరారైన తౌశిఫ్ కోసం డీజే హళ్ళి పోలీసులు గాలిస్తున్నారు.

English summary
A Muslim man murders by Thowshif in DJ Halli police station limit. Fight happen between two for a woman and its ended in murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more