చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్న కొడుకునే హత్య చేసిన సినీ రచయిత: విచారణలో ఏం చెప్పాడంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కన్నా కొడుకునే కడ తేర్చిన సిని రైటర్

మధురై: తమిళనాడులోని మధురైకి చెందిన ఓ సినీ కథా రచయిత తన కన్న కొడుకునే హత్య చేశాడు. బుధవారం అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో సామాజిక సమస్యలపై అర్థవంతమైన కథనాలు రాసిన జర్నలిస్టు గానూ ఆ కథా రచయితకు పేరు ఉంది. అలాంటి రచయిత కన్న కొడుకునే హత్య చేయడం ఇప్పుడు చెన్నైలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణలో హత్యకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఎవరీ రచయిత?:

ఎవరీ రచయిత?:

జర్నలిస్టుగా కెరీర్ ఆరంభించిన సౌందరపాండి(56), తర్వాతి కాలంలో సినీ కథా రచయితగా మారారు. తమిళ సినిమా 'సీవలపెరి పాండి'(1994) సినిమాకు కథ అందించారు. చాలామంది ఆయన్ను 'సౌబా' అనే ముద్దుపేరుతో పిలుస్తారు. జర్నలిస్టుగా కూడా పనిచేసిన ఆయన భ్రూణ హత్యలపై అర్థవంతమైన కథనాలు రాశారు.

భార్య లతాపూర్ణం(55)తో విభేదాల కారణంగా చాలాకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నారు సౌబా. అయితే వీరి కుమారుడు విపిన్ మాత్రం కొద్ది రోజులు తల్లి వద్ద, కొద్దిరోజులు తండ్రి వద్ద ఉంటున్నాడు.

 ఏప్రిల్ 30న మిస్సింగ్:

ఏప్రిల్ 30న మిస్సింగ్:

సౌందరపాండి మధురై పట్టణంలోని దోక్ నగర్ లో నివసిస్తున్నాడు. లతాపూర్ణం కూడా అదే పట్టణంలో ఓ ప్రభుత్వ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ క్రిష్ణానగర్ లో ఉంటున్నారు. పీజీ పూర్తి చేసిన వీరి తనయుడు విపిన్ కొంతకాలంగా ఖాళీగానే ఉంటున్నాడు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి అతను కనిపించకుండా పోవడంతో ఎస్ఎస్ పోలీస్ స్టేషన్ లో శనివారం లతాపూర్ణం ఫిర్యాదు చేశారు.

కారు విషయమై గొడవ:

కారు విషయమై గొడవ:

తండ్రి సౌందరపాండి కొనిచ్చిన ఓ లగ్జరీ కారును విపిన్ ఆయనకు తెలియకుండా అమ్మేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని కూడా ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సౌందరపాండిని ఆరాతీయగా ఆయనపై అనుమానం కలిగింది. బుధవారం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. కొడుకును తానే హత్య చేసినట్టు సౌందరపాండి అంగీకరించారు.

అందుకే చంపేశా..:

అందుకే చంపేశా..:

విపిన్‌కు తానే కారు కొనిచ్చానని, మత్తు పదార్థాలకు బానిసైన విపిన్‌ డబ్బులు కోసం తనను తరచూ వేధించడంతోపాటు కారు కూడా అమ్మేశాడని సౌందరపాండి పోలీసులకు తెలిపాడు. ఇదే విషయమై విపిన్ ను ప్రశ్నిస్తే.. తనను తీవ్రంగా దూషించాడని, అదే ఆగ్రహంతో సుత్తితో దాడిచేయగా అతను మరణించాడని పోలీసులకు వివరించాడు. విపిన్ ను హత్య చేసిన తర్వాత అమ్మాయనాయికనూర్ సమీపంలోని ఫాంహౌజ్ లో దహనం చేసినట్టు తెలిపారు. క్కడ పనిచేసే భూమి (40), గణేశన్‌ (42) ఇందుకు సహకరించినట్టు చెప్పాడు.

English summary
A Soundarapandi, 56, a noted writer from Madurai, was arrested by the city police on Wednesday for murdering his 27-year-old son over a dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X