వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ మార్క్: సెన్సార్‌బోర్డు చైర్‌పర్సన్‌గా పహ్లాజ్, సభ్యురాలిగా జీవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సెన్సార్ బోర్డు కొత్త చైర్ పర్సన్‌గా పహ్లాజ్ నిహలానీని, తొమ్మిది మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సెన్సార్ బోర్డు చైర్ పర్సన్‌గా ఉన్న లీలా శ్యాంసన్, సభ్యులు గతవారం రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త చైర్ పర్సన్‌ను, సభ్యులను నియమించింది.

పహ్లాజ్ నిహలానీ బాలీవుడ్‌లో నిర్మాతగా సుపరిచితులు. కాగా, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటి జీవితను కూడా సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమించారు.

Filmmaker Pahlaj Nihalani appointed Censor Board chief, jeevitha as member

సెన్సార్ బోర్డు సభ్యులుగా జీవితతో పాటు ఎస్ శేఖర్, అశోక్ పండిత్, సయ్యద్ బరీ, మిహిర్ భూటా, చంద్ర ద్వివేది, వాణి త్రిపాఠి, రమేష్ పతంగె, జార్జ్ బేకర్‌లు ఉన్నారు.

ది మెసెంజర్ ఆప్ గాడ్ సినిమాకు అప్పీలెట్ ట్రైబ్యునల్ అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ బోర్డు చీఫ్ లీలా శ్యాంసన్, తొమ్మిది మంది సభ్యులు రాజీనామా చేశారు. కాగా, పహ్లాజ్ నిహలానీ ప్రముఖ దర్శకుడు గోవింద్ నిహలానీ సోదరుడు. భారతీయ జనతా పార్టీ ఎంపీ శత్రఘ్ను సిన్హాకు బావమరిది.

కాగా, జీవిత తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. అనంతరం నిర్మాతగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు. రాజశేఖర్, జీవిత దంపతులు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో పని చేశారు. వైయస్ మృతి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జీవిత బీజేపీలో చేరారు.

English summary
Filmmaker Pahlaj Nihalani was on Monday appointed the new chief of Censor Board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X