చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలితతో పోలికా, కరుణానిధితో సై: శశికళ ఎఫెక్ట్.. పార్టీ వీడిన ఫిల్మ్ స్టార్

అన్నాడీఎంకేలో ప్రస్తుత పరిణామాలు బాగా లేవని, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రముఖ నటుడు, పార్టీ సీనియర్ నేత ఆనంద్ రాజ్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకేలో ప్రస్తుత పరిణామాలు బాగా లేవని, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రముఖ నటుడు, పార్టీ సీనియర్ నేత ఆనంద్ రాజ్ అన్నారు. ఆయన బుధవారం అన్నాడీఎంకే పార్టీకి రాజీనామా చేశారు.

జయలలితకు పార్టీ నేతలు తగిన గౌరవం ఇవ్వాలన్నారు. ఆమెతో ఎవరినీ పోల్చడం సరికాదన్నారు. పార్టీ శ్రేణులు సమ్మతించిన వ్యక్తులే పార్టీని నడపాలన్నారు. మంత్రులుగా వ్యవహరిస్తున్న పలువురు జయలలిత గౌరవ ప్రతిష్టలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం ేచశారు.

అన్నా డిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికవారు అలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు తనకు ఆహ్వానం అందలేదని, తాను వెళ్లడం లేదని ఆయన బుధవారమే చెప్పారు. పార్టీ నేతలు పొన్నయన్ తదితరుల వ్యాఖ్యలు తనకు బాధ కలిగిస్తున్నాయన్నారు. డిఎంకే అధ్యక్షులు కరుణానిధితో సమావేశమయ్యే అవకాశం లభిస్తే తప్పకుండా భేటీ అవుతానని చెప్పారు.

 Filmstar Anandraj resigns AIADMK

కాగా, గురువారం నాడు అన్నాడీఎంకే పార్టీ వానగరంలోని శ్రీవారి మండపంలో సమావేశమై శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించిన విషయం తెలిసిందే. శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించడం ముందే ఖాయమైనందువల్ల పలువురు అసంతృప్తికి లోనయ్యారు.

English summary
Senior party leader and filmstar Anandraj quit the party in an apparent fallout with the close aide of late Chief Minister J Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X