India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

flashback 2019: సుష్మా స్వరాజ్-షీలా దీక్షిత్! కీలక నేతలను తీసుకెళ్లింది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశానికి వారు ఎంచుకున్న రంగంలో ఎంతో సేవ చేశారు. దేశానికి, దేశ ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తాము చేసిన సేవలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొంత కాలం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆకస్మిక మరణంతో మనందర్నీ విడిచివెళ్లిపోయారు. ప్రముఖ రాజకీయ, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో సేవలందించినవారు ఉన్నారు.

2019 సంవత్సరంలో దేశం రాజకీయ రంగంలో ప్రముఖ నేతలను కోల్పోయింది. వారిలో మాజీ కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నారు. పారికర్ క్యాన్సర్‌తో మరణించారు. కేరళ అసెంబ్లీ చరిత్రలో సుదీర్ఘ కాలం సభ్యుడిగ పనిచేసిన కేఎం మణి 2019లోనే ప్రాణాలు వదిలారు.

flashback 2019: దేశాన్ని కదిలించిన 'దిశ’, ఒక చెడు ఆలోచనే ఐదు కుటుంబాల్లో తీరని శోకంగా..flashback 2019: దేశాన్ని కదిలించిన 'దిశ’, ఒక చెడు ఆలోచనే ఐదు కుటుంబాల్లో తీరని శోకంగా..

సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్

భారత ప్రజల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేత సుష్మా స్వరాజ్. విదేశాంగా మంత్రిగా ఆమె చేసిన సేవలు మరువలేనవే. ట్విట్టర్ వేదికగా బాధితులు సాయం కోరిన వెంటనే వారికి కావాల్సిన సాయాన్ని చేసి మన్ననలు అందుకున్నారు. ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. 2014-19లోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమె విదేశాంగశాఖ మంత్రిగా సేవలు అందించారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగశాఖ మంత్రి సేవలందించిన మహిళగా సుష్మా రికార్డు సృష్టించారు.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ ఆగస్టు 24న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెకు సంబంధించిన వ్యాధితో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్దిరోజులపాటు అక్కడే చికిత్స పొందారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ సేవలందించారు. బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగిన ఆయన ఈ ఏడాదిలోనే ఆకస్మికంగా మరణించారు. అనారోగ్య కారణాలతోనే 2019 ఎన్నికలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.

మనోహర్ పారికర్

మనోహర్ పారికర్

గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రక్షణశాఖ మంత్రిగా ఉండగానే పీవోకేలో భారత సైన్యం మొదటి సర్జికల్ స్టైక్స్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 24న మనోహర్ పారికర్ క్యాన్సర్ వ్యాధితో తుదిశ్వాస విడిచారు. బీజేపీకే గాక, దేశానికి కూడా ఆయన లేనిలోటు తీరనిదనే చెప్పవచ్చు. ముఖ్యంగా గోవా ప్రజలు ఒక మంచి ముఖ్యమంత్రిని కోల్పోయారనే చెప్పాలి.

మీరా సన్యల్

మీరా సన్యల్


ఏస్ బ్యాంకర్, 2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన మీరా సన్యల్(57) జనవరి 11, 2019లో మరణించారు. రెండేళ్ళపాటు క్యాన్సర్ వాధితో పోరాడిన ఆమె చివరకు జనవరి 11న తుది శ్వాస విడిచారు. మనదేశంలో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ సీఈఓగా ఆమె పనిచేశారు.

శివాజీరావు దేశ్‌ముఖ్

శివాజీరావు దేశ్‌ముఖ్

సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత శివాజీరావు(84) దేశ్‌ముఖ్ 2019, జనవరి 14న తుదిశ్వాస విడిచారు. 1996, 2002లో మహారాష్ట్ర లేజిస్టేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 1978, 1980, 1985, 1990లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు.

వైఎస్ వివేకానంద రెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి


ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైయస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి మార్చి 15, 2019లో అనుమానాస్పాద స్థితిలో మృతి చెందారు. 1989, 1994లో, 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి కడప నుంచి లోక్‌సభ ఎంపీగా కూడా గెలుపొందారు.

English summary
Every year we lose a variety of award-winning, awe-inspiring and at times, controversial figures in the entertainment, political, business, philanthropic and fashion worlds - and 2019 was no different.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X