వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరికి న్యాయం జరిగింది, న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు: నిర్భయ తల్లి ఆశాదేవి

|
Google Oneindia TeluguNews

నిర్భయ దోషులను తీహార్ జైలులో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరితీశారు. దోషుల న్యాయ ప్రక్రియ ముగియడంతో శిక్షను అమలుచేశారు. తెల్లవారుజామున జైలు బయట భారీ ఎత్తున జనం గుమికూడారు. దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ , ముఖేశ్ కుమార్‌‌ను ఉరితీశారు. నిర్భయ దోషులను ఉరితీయండపై నిర్భయ పేరంట్స్ ఆశాదేవి సహా యావత్ జాతి ముక్తకంఠంతో స్వాగతించింది.

చివరికి న్యాయం..

చివరికి న్యాయం..

నిర్భయపై దారుణంగా లైంగికదాడి చేసి.. చనిపోయేందుకు కారణమైన దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని నిర్భయ తల్లి ఆశాదేవి స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు ఎంత చిత్రవధతో చనిపోయిందో చూశానని.. దోషుల శిక్ష కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. చివరికి ఇవాళ న్యాయం జరిగిందని తెలిపారు. తన కూతురికి జన్మనిచ్చానని.. కానీ కాపాడుకోలేకపోయానని విలపించారు. కానీ తన కూతురు మరణానికి కారణమైన వారికి మాత్రం శిక్ష విధించడంతో న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

 సుదీర్ఘ నిరీక్షణ..

సుదీర్ఘ నిరీక్షణ..

నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష అమలుపై ఆమె తండ్రి బద్రీనాథ్ సింగ్ స్పందించారు. దోషులకు శిక్ష విధించేందుకు చాలా సమయం తీసుకున్నారు... కానీ చివరికి తమకు న్యాయం జరిగిందని తెలిపారు. దోషులకు శిక్ష విధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. నగరాలు, పట్టణాల్లో ఉరిశిక్షను స్వాగతించారు.

అనాగరిక చర్య..

అనాగరిక చర్య..

నిర్భయ ఘటనపై తమ పోరాటానికి న్యాయం జరిగిందిన ఆమె తరఫు లాయర్ పేర్కొన్నారు. అనాగరిక చర్యపై గొంతెత్తి పోరాడామని పేర్కొన్నారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారని.. అందుకు నిర్భయ ఘటనే ఉదహరణ అని పేర్కొన్నారు. కానీ చివరికి బాధితురాలికి న్యాయం జరిగందని తెలిపారు.

ఇదీ కేసు నేపథ్యం..

ఇదీ కేసు నేపథ్యం..

2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి, దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందారు. మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం సింగపూర్ తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దోషి రామ్ సింగ్, తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరొకడు జువైనల్ హోంలో మూడేళ్ల శిక్ష అనుభవించి బయటకొచ్చాడు. మరో నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్ జైలులో ఉన్నారు. వీరికి కోర్టు ఉరిశిక్ష విధించగా.. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. తమకు ఉన్న న్యాయ ప్రక్రియను వినియోగించుకున్నారు. ఇప్పటికే ఉరిశిక్ష మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. చివరికి శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరిశిక్ష విధించారు.

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines : Key Points Of YS Jagan, Narendra Modi Meet

English summary
convicts in the Nirbhya case were finally hanged after 7 long years in Tihar jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X