వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసమ్మతి సెగ, చేతులు ఎత్తేసిన మాజీ సీఎం: రంగంలోకి సీఎం కుమారస్వామి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి సినిమా కష్టాలు మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలు ఎంతకు మనసు మార్చుకోకపోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వారిని బుజ్జగించడానికి రంగంలోకి దిగారు.

<strong>రాజీనామాలకు ఎమ్మెల్యేలు క్యూ, బాంబు పేల్చిన బళ్లారి శ్రీరాములు, సంకీర్ణ ప్రభుత్వానికి షాక్, బీజేపీ!</strong>రాజీనామాలకు ఎమ్మెల్యేలు క్యూ, బాంబు పేల్చిన బళ్లారి శ్రీరాములు, సంకీర్ణ ప్రభుత్వానికి షాక్, బీజేపీ!

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన చుంచోళి శాసన సభ్యుడు డాక్టర్ ఉమేష్ జాదవ్ తన పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు. డాక్టర్ ఉమేష్ జాదెవ్ లాగా మరి కొంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చెయ్యడానికి సిద్దం కాండంతో ఆ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు.

Finally Karnataka Chief minister HD Kumaraswamy enter the field to hear dissident MLAs voice.

ఇంత కాలం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం, ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నచ్చచెబుతారని, తమకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. అయితే పరిస్థితి చెయ్యిదాటుతుందని గ్రహించిన సీఎం కుమారస్వామి ఇప్పుడు రంగంలోకి దిగారు.

<strong>కర్ణాటక ప్రభుత్వానికి షాక్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా, మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం!</strong>కర్ణాటక ప్రభుత్వానికి షాక్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా, మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం!

కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి నివాసంలో అసమ్మతి ఎమ్మెల్యేలు నాగేంద్ర, మహేష్ కుమటళ్లి మంతనాలు జరిపారు. సంకీర్ణ ప్రభుత్వం తీరుపై ముగ్గురు ఎమ్మెల్యేలు బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేశారు.

అసమ్మతి ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు అనేక మంది మంత్రులు చర్చలు జరిపినా అవి ఫలించలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతకు దిగిరాకపోవడంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం బుధవారం స్వయంగా ముఖ్యమంత్రి కుమారస్వామి రంగంలోకి దిగారు.

ముగ్గురు అసమత్మి ఎమ్మెల్యేలకు మరికొంత మంది ఎమ్మెల్యేలు జత అవుతానపని గ్రహించిన సీఎం కుమారస్వామి వారితో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించడానికి సిద్దం అయ్యారు. అవసరం అయితే జేడీఎస్ కు చెందిన కొందరు మంత్రులతో రాజీనామీ చేయించి ఆ పదవులను కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి సీఎం కుమారస్వామి సిద్దం అయ్యారని సమాచారం. మొత్తం మీద సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు సినిమా చూపిస్తున్నారు.

English summary
Finally Chief minister HD Kumaraswamy enter the field to hear dissident MLAs voice. He visited Ramesh Jarkiholi Residence in Bengaluru Today(March 6).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X