వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'లవర్స్'పై జీఎస్టీ ఎఫెక్ట్: కండోమ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఛార్జీలపై ఇలా!..

విమాన ప్రయాణం చేయాలనుకునేవారు ఎకనమిక్ క్లాస్ లో ప్రయాణం చేస్తే.. ఖర్చు కాస్త తగ్గే అవకాశం ఉంది. అదే బిజినెస్ క్లాస్ అయితే ఖర్చు పెరుగుతుందని చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ పైనే దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతోంది. జీఎస్టీ ప్రవేశపెట్టడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న అంశాలను బేరీజు వేస్తూ ఎవరి విశ్లేషణల్లో వారు మునిగిపోయారు.

మరోవైపు ఉత్పాదక రంగంలో కీలకంగా ఉన్న రాష్ట్రాలు ఈ విధానం పట్ల ఒకింత అసంతృప్తితోనే ఉన్నాయి. వ్యాట్, అమ్మకపు పన్ను, కొనుగోలు పన్ను, లగ్జరీ పన్ను, ప్రవేశపన్ను, వినోద పన్ను,ప్రకటనల పన్ను, ఇలా చాలావరకు పన్నులు జీఎస్టీ ఏకీకృ త పన్ను విధానం కిందకు వెళ్తుండటంతో.. రాష్ట్రాల ఆదాయానికి భారీ గండి పడినట్లేనన్న వాదన వినిపిస్తోంది.

<strong>అసలేమిటీ జీఎస్టీ? వినియోగదారుడికి అంతిమంగా లాభమా? నష్టమా?</strong>అసలేమిటీ జీఎస్టీ? వినియోగదారుడికి అంతిమంగా లాభమా? నష్టమా?

జీఎస్టీ ప్రభావం దేనిపై ఎలా ఉన్నప్పటికీ.. డేటింగ్ ప్రియులకు, బయటి ప్రపంచంలో ఎక్కువగా విహరించాలనుకునేవారికి దీనిపై ప్రభావం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.

రెస్టారెంట్లపై ఎఫెక్ట్:

రెస్టారెంట్లపై ఎఫెక్ట్:

ప్రేమలో మునిగి డేటింగ్‌లో ఉన్నవారు, లేదా భార్యభర్తలు.. ఇలా ఎవరైనా సరే డిన్నర్ డేట్ కోసం రెస్టారెంట్లకు వెళ్లడం కామన్. జీఎస్టీ అమలు తర్వాత లగ్జరీ ఏసీ రెస్టారెంట్లలో ఛార్జీలు తగ్గనున్నాయి. జీఎస్టీ తర్వాత ప్రస్తుతం ఉన్న 28శాతం పన్ను స్థానంలో 18శాతం పన్ను అమలవుతుంది కాబట్టి ఛార్జీలు తగ్గనున్నాయి. అదే సమయంలో నాన్ ఏసీ రెస్టారెంట్లలో మాత్రం బిల్లు భారం పెరగనుంది.

బహుమతుల రేట్లు పెరగనున్నాయి:

బహుమతుల రేట్లు పెరగనున్నాయి:

ప్రియుడు లేదా ప్రియురాలి పుట్టినరోజుకు బహుమతులు కొనివ్వడం ఇకనుంచి భారమనే చెప్పాలి. జీఎస్టీ ప్రవేశంతో బహుమతులపై గరిష్టంగా 28శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. దీంతో పుట్టినరోజుల సందర్భంగా.. గిఫ్టులు కొనుగులు చేయడం ప్రేమికుల జేబుకు చిల్లుపడే వ్యవహారమే!

సినిమాలపై బాదుడే:

సినిమాలపై బాదుడే:

సినిమాలకు వెళ్లే ప్రేమికులకు అక్కడా షాక్ తప్పదు. జీఎస్టీ తర్వాత మల్టీప్లెక్స్ లలో అదనుపు రుసుం వసూలు చేయనున్నారు. మల్టీపెక్స్ లలో జీఎస్టీని 18శాతం 28శాతానికి పెంచడంతో మల్టీపెక్స్ లలో టికెట్ల ధరలు పెరగనున్నాయి.

కండోమ్‌లపై నో ఎఫెక్ట్!:

కండోమ్‌లపై నో ఎఫెక్ట్!:

కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలపై జీఎస్టీ ప్రభావం అంతగా ఉండబోదు. వీటి ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. అదే సమయంలో హోటల్ బిల్స్ సైతం తగ్గే అవకాశం ఉండటంతో.. డేటింగ్ ప్రియులకు ఇది అనుకూలించే అంశమే.

విమాన ప్రయాణంపై ఇలా:

విమాన ప్రయాణంపై ఇలా:

విమాన ప్రయాణం చేయాలనుకునేవారు ఎకనమిక్ క్లాస్ లో ప్రయాణం చేస్తే.. ఖర్చు కాస్త తగ్గే అవకాశం ఉంది. అదే బిజినెస్ క్లాస్ అయితే ఖర్చు పెరుగుతుందని చెబుతున్నారు. ఇక క్యాబ్ సర్వీసులను ఉపయోగించుకునేవారికి జీఎస్టీ అనుకూలంగానే ఉండనుంది. క్యాబ్ సంస్థలపై 6శాతంగా ఉన్న 5శాతానికి తగ్గుతుండటంతో వీటిలో ప్రయాణం ఇంతకుముందుతో పోల్చితే స్వల్ప లాభమనే చెప్పాలి.

English summary
Its about finance information after gst effect especially on lovers who are in dating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X