వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాన్స్ నాయక్ హనుంతప్పకు అరుదైన గౌరవం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సియాచిన్ మంచు కొండల్లో ఆరు రోజుల పాటు సజీవంగా తన ప్రాణాలను నిలుపుకొని, ఆ తర్వాత మూడు రోజులు మృత్యువుతో పోరాడి అశువులు బాసిన లాన్స్ నాయక్ హనుమంతప్పకు అరుదైన గౌరవం లభించింది.

భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ లాన్స్ నాయక్ హనుంతప్పకు ఘన నివాళి అర్పించింది. ఇందులో భాగంగా ఆర్ధిక శాఖ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలో ఉండే ప్రభుత్వ చిహ్నం స్థానంలో లాన్స్ నాయక్ హనుమంతప్ప ఫోటోను వాల్ పేపర్‌గా ఉంచి అంజలి ఘటించారు.

Finance Ministry puts Lance Naik Hanamanthappa's photo on Twitter handle

"వీర జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప మరణం నా మనసును తీవ్రంగా కలచివేస్తోంది. ఆయన కుటుంబం ఈ బాధ నుంచి బయటపడి నిలబడాలని కోరుకుంటున్నాను" అని అరుణ్ జైట్లీ తన ట్విట్టర్‌లో సందేశాన్ని పోస్టు చేశారు. కాగా, హనుమంతప్ప మృతదేహం ఇప్పటికే కర్ణాటకలోని ఆయన స్వగ్రామానికి చేరుకోగా, శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా ఫిబ్రవరి 3న 19,600 అడుగుల ఎత్తులోని సియాచిన్ గ్లేసియర్‌లోని సైనిక శిబిరంపై భారీ ఎత్తున మంచు కొండ చరియలు విరిగిపడటంతో చెన్నైకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో పాటు మొత్తం పది మంది సైనికులు దాని కింద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

అయితే వారిలో లాన్స్ నాయక్ హనుమంతప్ప మాత్రమే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆరు రోజులు పాటు సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, అతడి శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో కోమాలోకి వెళ్లిన హనుమంతప్పు చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

English summary
The Finance Ministry on Thursday made a picture of Lance Naik Hanamanthappa Koppad as its cover photo on its Twitter handle as a mark of respect to the brave soldier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X