వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో అత్యుత్తమ బ్యాంక్ ఏదో తెలుసా.. ఫైనాన్స్ ఏసియా ఓటు దేనికి..

|
Google Oneindia TeluguNews

పెట్టుబడిదారుల సంఘం, విశ్లేషకుల మధ్య నిర్వహించిన ఒక పోల్‌లో, అగ్రశ్రేణి గ్లోబల్ ఫైనాన్షియల్ మేగజైన్ ఫైనాన్స్ ఆసియా.. భారతదేశంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న బ్యాంకుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి అనుకూలంగా ఓటు వేసింది. అలాగే కార్పోరేట్ గవర్నెన్స్ సెగ్మెంట్‌లోనూ ఉత్తమ సేవలు అందిస్తున్న బ్యాంకుగా ప్రశంసలు దక్కించుకుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో కూడా బెస్ట్ సీఈవోగా ప్రశంసలు దక్కించుకున్నారు. గతంలోనూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఈ గుర్తింపు దక్కింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకి దక్కిన గుర్తింపుపై సంస్థ చైర్‌పర్సన్ శ్యామల గోపీనాథ్ హర్షం వ్యక్తం చేశారు. పారదర్శకంగా,నిబద్దతతో పనిచేస్తున్న తమ సంస్థకు దక్కిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నామని చెప్పారు. కస్టమర్లను తామెప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామని.. విలువలు,సమగ్రత,గవర్నెన్స్ విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని చెప్పారు.

 FinanceAsia Ranks HDFC Bank As Best Company In India

ఇవే ప్రమాణాలను ఇకముందు కూడా కొనసాగించడానికి కృషి చేస్తామన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1995 లో "ప్రపంచ స్థాయి ఇండియన్ బ్యాంక్" అనే ఒక సాధారణ మిషన్‌తో కార్యకలాపాలను ప్రారంభించిందని గుర్తుచేశారు.. ఉత్పత్తి నాణ్యత, సేవా నైపుణ్యం కారణంగా తాము ఆ లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు.

కాగా, కార్పోరేట్ గవర్నెన్స్ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీతో పాటు బజాజ్ ఫిన్సర్వ్ టీసీఎస్,కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా అగ్ర స్థానంలో నిలిచాయి. 5 వ స్థానంలో ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్ రెండూ ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలలో, పేటీఎం ఉత్తమ ప్రైవేట్ సంస్థగా నిలిచింది.

English summary
In a poll carried out amongst investor community and analysts, a top global financial magazine FinanceAsia has voted in favour of HDFC Bank being the best managed Company in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X