వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం సంతకం మాత్రమే చేశారు, కార్తీకి సంబంధం లేదు: కపిల్ సిబల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం ఎలాంటి తప్పూ చేయలేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) ఐఎన్ఎక్స్ మీడియాకు కియరెన్స్ ఇచ్చిందని, ఆ తర్వాత ఆర్థికమంత్రిగా చిదంబరం కేవలం సంతకం మాత్రమే చేశారని చెప్పుకొచ్చారు.

కార్తీ చిదంబరం పాత్ర ఉందని ఎఫ్ఐపీబీ అధికారులు పేర్కొనలేదు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం పాత్ర ఉందని ఎఫ్ఐపీబీ అధికారులు ఎక్కడా పేర్కొనలేదని న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అందరు ఎఫ్ఐపీబీ సెక్రటరీలను ప్రశ్నించిందని.. అయితే, వారిలో ఒక్కరూ కూడా కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తమను సంప్రదించారని చెప్పలేదని తెలిపారు.

FIPB board gave approval to INX Media, Ex-FM only signed: Chidambarams lawyer

బెనిఫిషియరీ కంపెనీ అక్రమంగా ఆమోదం పొందిందని, ఐటీ డిపార్ట్‌మెంట్ తప్పుడు సమాచారం ఇచ్చిందనేవి ఈడీ ఆరోపణలని సిబల్ వ్యాఖ్యానించారు. తమపై కార్తీ చిదంబరం ఎలాంటి ఒత్తిడి చేసినట్లుగానీ ఎఫ్ఐపీబీ అధికారులు ఎవరూ కూడా చెప్పలేదని అన్నారు.

<strong>అవి ఆధారాలా?: ఈడీపై విరుచుకుపడ్డ చిదంబరం లాయర్ కపిల్ సిబల్</strong>అవి ఆధారాలా?: ఈడీపై విరుచుకుపడ్డ చిదంబరం లాయర్ కపిల్ సిబల్

అంతేగాక, అడ్వంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ లిమిటెడ్(ఏఎస్‌సీపీఎల్)తో కార్తీ చిదంబరానికి ఎలాంటి సంబంధం లేదని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయం, ఆస్తులు అని ఈడీ వీరి ఆస్తులను అటాచ్ చేసిందని తెలిపారు. అలా ఈడీ అనడానికి ఏదైనా సంబంధం ఉందా? అని కపిల్ సిబల్ ప్రశ్నించారు.

కేసు విషయంలో చిదంబరాన్ని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా సమాచారాన్ని లీక్ చేసి సంచలనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం నేరం చేశారంటున్న ఈడీ ఎలాంటి ఆధారాలను చూపడం లేదని అన్నారు. మొత్తం 26.5గంటలపాటు విచారించిన సీబీఐ.. చిదంబరాన్ని కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రం అడగలేదని ఆరోపించారు. చిదంబరంను ట్విట్టర్ అకౌంట్ ఉందా? అని ఈడీ ప్రశ్నించిందని చెప్పారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 2018లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు మనం 2019 ఆగస్టులో ఉన్నాం. పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఉన్న డాక్యుమెంట్లను సీల్డ్ కవర్లో న్యాయస్థానం ముందు ఉంచాలని సిబల్ వ్యాఖ్యానించారు. ప్రొసీడింగ్స్‌ను సంచలనం చేసేందుకు మీడియాకు లీకులు ఇస్తోందంటూ ఈడీపై సిబల్ మండిపడ్డారు. దర్యాప్తును మంత్రగత్తె వేట, మీడియా విచారణగా మార్చకూడదని వ్యాఖ్యానించారు.

English summary
In another statement, Kapil Sibal said the FIPB board had given clearance to INX Media and P Chidamabaram only signed it as the then finance minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X