వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహర్‌లో పాక్ అనుకూల నినాదాలు: 21 మందిపై కేసు, మత ఘర్షణల కోసమేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: మొహర్రం వేడుకల్లో పాక్ క్రికెటర్లు ధరించే జెర్సీ వేసుకుని ఆ దేశ అనుకూల నినాదాల చేసిన 21 మందిపై బిహార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని బెట్టయ్య ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

చేతిలో లాఠీలతో పాక్ జెర్సీ ధరించిన కొందరు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినదించారు. ఓ వైపు దుర్గా పూజ, మరోవైపు మొహర్రం జరుపుకుంటుండడంతో మత ఘర్షణలకు తావిచ్చేలా వారు వ్యవహరించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్‌లో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జత చేసినట్టు తెలిపారు.

FIR against 21 after pro-Pakistan slogans raised during Muharram procession in Bihar’s Bettiah

ఘటన అనంతరం పాక్ జెర్సీలు ధరించిన యువకుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు పోలీసు అధికారి వివేక్ కుమార్ జైస్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా పాక్ జెర్సీలు, వివాదాస్పద పుస్తకాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 21 మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ వినయ్‌కుమార్ పేర్కొన్నారు. బీహర్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

English summary
The police on Monday detained three persons and lodged first information reports (FIRs) against 21 persons who reportedly raised pro-Pakistan slogans during a Muharram procession near Bettiah on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X