వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినుల అండర్ వేర్ విప్పిన ఘటనలో ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు, వార్డెన్, మరొ ఇద్దరిపై కూడా..

|
Google Oneindia TeluguNews

మహాత్మాగాంధీ నడయాడిన నేలలో దారుణం జరిగింది. ఓ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించారు. విద్యార్థులకు నెలసరి వచ్చిందో లేదేననే అంశంపై పరిశీలించేందుకు డ్రాయర్ విప్పమని కోరడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. ప్రిన్సిపాల్, వార్డెన్ సహా మరొ ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

పీరియడ్ సమయంలో..

పీరియడ్ సమయంలో..

గుజరాత్‌లోని బుజ్ జిల్లాలో శ్రీ సహజానంద గర్ల్స్ ఇనిస్టిట్యూట్ ఉంది. స్వామి నారాయణన్ మందిర్ భక్తులు ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు చెందిన 1500 మంది విద్యార్థినిలు ఇక్కడ చదువుకొంటున్నారు. అయితే కాలేజీ ప్రాంగణంలో ఆలయం ఉంది. రుతుక్రమంలో ఉన్న సమయంలో కూడా విద్యార్థినిలు ఆలయానికి వెళ్తున్నారని వార్డెన్ గుర్తించి.. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.

అండర్‌వేర్ విప్పమని..

అండర్‌వేర్ విప్పమని..

ప్రిన్సిపాల్ 64 మంది విద్యార్థినీలకు వరసక్రమంలో నిలబెట్టారు. రుతుక్రమం గురించి అడగగా.. లేదని చెప్పడంతో ఒక్కొక్కరిని అండర్ వేర్ విప్పమని కోరారు. కాలేజీ ప్రాంగణంలో ఆలయం, వంట గదిలోకి వెళ్లొద్దని.. అంతేకాదు రుతుక్రమం ఉన్నవారు మరొకరిని తాకొద్దని చెప్తున్నారు. అలా కొందరు నిబంధనలు ఉల్లంఘించడంతో బాలికలను అండర్ వేర్ విప్పాలని కోరడం చర్చకు దారితీసింది.

ఇప్పుడే కాదు..

ఇప్పుడే కాదు..

విశ్రాంతి గదిలోకి తీసుకెళ్లి మరీ చూశారని, ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలా చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాము దూర ప్రాంతాల నుంచి వస్తామని, ప్రయాణించడం ఇబ్బందికి గురవుతున్నామని కాలేజీ హాస్టల్.‌లో ఉన్నామని రెండో విద్యార్థిని చెప్పారు.

కోర్టుకెళ్లండి.. కానీ...

కోర్టుకెళ్లండి.. కానీ...

ఘటనపై కాలేజీ ట్రస్టీ ఒకరు స్పందించారు. కోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లాలని.. కానీ కాలేజీ హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని కోరారు. దానికి సంబంధించి ధృవీకరణ పత్రం అందజేసి.. సంతకం చేసి ఇవ్వాలని కోరారు. ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఘటనపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నది. విద్యార్థులతో సమావేశమై ఏం జరిగిందో తెలుసుకుంటామని తెలిపారు. ఘటనపై కాలేజీ ట్రస్టీ, ప్రిన్సిపాల్ నుంచి వివరణ తీసుకుంటామని స్పష్టంచేశారు.

సాంప్రదాయాలకు పెద్దపీట..

సాంప్రదాయాలకు పెద్దపీట..

భారతీయ విలువలు, సాంప్రదాయాలు అనే పునాదులపై శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌‌ను ఏర్పాటు చేశారు. సాంప్రదాయ విలువలకు ఇక్కడ పెద్ద పీట వేస్తారు. ఇక్కడి నియమాల ప్రకారం.. నెలసరి సమయంలో విద్యార్థినులు ఆలయంలోకి, కిచెన్‌లోకి వెళ్లరాదు. అదే సమయంలో ఇతర విద్యార్థులను కూడా తాకరాదు. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది.

English summary
Gujarat Police has registered an FIR against the principal of a college in Bhuj for forcing 64 girl students to remove their underwear in order prove they weren't on period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X