వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక సీఎంపై ఎఫ్ఐఆర్, కులం పేరుతో ఓటర్లను రెచ్చగొట్టారు, మనమే అధికారంలో ఉండాలి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్, యడియూరప్ప మీద ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘించి బహిరంగంగా ఓటర్లను ప్రభావితం చెయ్యడానికి సీఎం యడియూరప్ప ప్రయత్నించారని, మన కులం ఓట్లు ఒక్కటీ పక్కకు పోకుండా చూడాలని, మనమే అధికారంలో ఉండాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చెయ్యడంతో సీఎం యడియూరప్ప మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!

సీఎం ఏం చెప్పారు ?

సీఎం ఏం చెప్పారు ?

కర్ణాటకలోని 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలు డిసెంబర్ 5వ తేదీ జరుగుతున్నాయి. ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం యడియూరప్ప బిజీబిజీగా ఉన్నారు. గోకాక్ లోని వాల్మీకి క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సమావేశంలో సీఎం యడియూరప్ప పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓటర్లను ఉద్దేశించి సీఎం యడియూరప్ప మాట్లాడుతూ మన ప్రభుత్వం (బీజేపీ) పూర్తి కాలం అధికారంలో ఉండాలంటే మన వీరశైవ లింగాయత్ కులానికి చెందిన ఒక్క ఓటు కూడా ప్రతిపక్ష పార్టీలకు వెయ్యకూడదని, ఎలాంటి ప్రలోభాలకు మనం గురి కాకూడదని, దయచేసిన తన మాట వినాలని సీఎం యడియూరప్ప స్థానిక ఓటర్లకు మనవి చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

రుణం తీర్చుకునే సమయం వచ్చింది

రుణం తీర్చుకునే సమయం వచ్చింది

మాజీ మంత్రి రమేష్ జారకిహోళి (అనర్హత ఎమ్మెల్యే) మరో 16 మంది అనర్హత ఎమ్మెల్యేలను ఒక్కటి చేసి కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద పోరాటం చేశారని, లేదంటే నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని కాదని, మంత్రులు జగదీష్ శెట్టర్, శశికళ జోల్లా విధాన సౌధ మూడవ అంతస్తులో కుర్చోవడానికి అవకాశం లేకుండా పోయేదని, ఈ విషయం మేము జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని, ఉప ఎన్నికల్లో వారిని గెలిపించి వారి రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని సీఎం యడియూరప్ప అన్నారు.

ప్రతిపక్షాల ఫిర్యాదు

ప్రతిపక్షాల ఫిర్యాదు

సీఎం యడియూరప్ప వీరశైవ లింగాయుత కులానికి చెందిన ఒక్క ఓటు ప్రతిపక్ష పార్టీలకు వెయ్యకూడదని సీఎం యడియూరప్ప ఆ కులం ఓటర్లను రెచ్చగొట్టారని ప్రతిపక్ష పార్టీల నాయకులు భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో కులాలను రెచ్చగొట్టి సీఎం యడియూరప్ప ఓటర్లను ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నించారని, ఆయన ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్ఐఆర్ నమోదైయ్యింది.

ఎన్నికల్లో రమేష్ పోటీ

ఎన్నికల్లో రమేష్ పోటీ

డిసెంబర్ 5వ తేదీ కర్ణాటకలో 15 శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గోకాక్ శాసన సభ నియోజక వర్గంలో మాజీ మంత్రి, అనర్హత ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రమేష్ జారకిహోళి సోదరుడు లఖన్ జారకిహోళి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద, జేడీఎస్ నుంచి అశోక్ పూజారీ ఇదే గోకాక్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రమేష్ జారకిహోళిని గెలిపించాలని సీఎం యడియూరప్ప ఎన్నికల ప్రచారం చేసిన సమయంలో వీరశైవ లింగాయుత కులం ఓటర్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు ఫిర్యాదు చెయ్యడంతో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైయ్యింది.

English summary
Karnataka Election commission has registered a FIR against Karnataka chief minister B. S. Yediyurappa for violating model code of conduct. 15 seat by elections will be held on December 5, 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X