వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ కూతురు మీసా హంగామా, ఈవిఎం ధ్వంసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, పాటలీపుత్రం అభ్యర్థి మీసా భారతికి గురువారం హంగామా సృష్టించారు. పోలింగ్ కేంద్రంలో ఈవిఎంను ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు మీసా భారతిపై దాడి చేశారని ఆర్జెడి ఆరోపిస్తోంది.

ఆర్జెడి నుండి భారతీయ జనతా పార్టీలోకి చేరిన రాం కృపాల్ యాదవ్‌కు పాటలీపుత్రం టిక్కెట్‌ను బిజెపి అధిష్టానం ఇచ్చింది. దీంతో రాం కృపాల్ యాదవ్... మీసా భారతి పైన పోటీ చేస్తున్నారు. ఆర్జెడి పాటలీపుత్రం టిక్కెట్ ఇవ్వక పోవడంతో ఆయన బిజెపిలో చేరి పోటీలో నిలబడ్డారు.

FIR against Lalu's daughter Misa for damaging EVM

ఈ విషయమై పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరగ్గా.. పోలింగ్ అధికారులను నెట్టివేశారని, ఈవిఎంను ధ్వంసం చేశారని మీసా భారతి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తమిళనాడే ఎక్కువ అభివృద్ధి చెందింది: జయలలిత

గుజరాత్ అద్భుతమైన ప్రగతిని సాధించిందని చేస్తున్న ప్రచారమంతా వాస్తవం కాదని గుజరాత్ అభివృద్ధిని అద్భుతంగా మార్కెట్ చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విమర్శించారు. వాస్తవానికి గుజరాత్ కన్నా తమిళనాడు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తమిళనాడులో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ తమదేనన్నారు.

English summary
A police complaint was filed against Lalu Prasad’s daughter Misa Bharti, who is contesting on the Rashtriya Janata Dal’s ticket from Pataliputra in Bihar, on Thursday for allegedly pushing a poll official and damaging an electronic voting machine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X